కేఎంసీ రాజకీయ సేవ!
కాకినాడ రూరల్: నవ్వి పోదురు నాకేంటి అన్నట్టుగా ఉంది కూటమి పాలకుల తీరు. పిఠాపురం సమీపం చిత్రాడలో శుక్రవారం జరగనున్న జనసేన ప్లీనరీ కోసం కాకినాడను ఆ పార్టీ స్వాగత ద్వారాలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లతో ముంచెత్తారు. సర్పవరం జంక్షన్ కూడలి వద్ద నాలుగు వైపులా భారీ స్వాగత ద్వారాలను గురువారం ఏర్పాటు చేశారు. ఇందుకు ఉదయం నుంచి రాత్రి వరకు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్(కేఎంసీ)కి చెందిన ప్రజాధనంతో పనిచేసే రెండు భారీ క్రేన్లను వినియోగించారు. వీధి దీపాల ఏర్పాటుకు వాడే వీటిని జనసేన స్వాగత ద్వారాల కోసం వినియోగించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. పార్టీ కార్యక్రమాలకు కేఎంసీ క్రేన్ల వినియోగంపై సర్పవరం జంక్షన్ మీదుగా రాకపోకలు సాగించిన పలువురు నిర్ఘాంతపోయారు. అధికార కూటమి పార్టీ కావడంతో కార్పొరేషన్ అధికారులు నిబంధనలకు పాతర వేశారని పలువురు విమర్శలు గుప్పించారు.
సర్పవరం జంక్షన్ వద్ద
జనసేన స్వాగత ద్వారాల
నిర్మాణంలో క్రేన్లు
నిర్ఘాంతపోయిన ప్రజలు
Comments
Please login to add a commentAdd a comment