● రంగుల హరివిల్లై.. సప్తవర్ణాల సంబరమై..
ఆకులు రాలుస్తూ.. హరితావరణాన్ని మోడువార్చి, కళావిహీనంగా చేసిన శిశిరం మరో పక్షం రోజుల్లో కనుమరుగు కానుంది. చెట్టూచేమా కొత్త చివుళ్లు తొడుగుతూ.. ప్రకృతి సరికొత్త రంగులను అద్దుకునే వసంతం ఆగమించనుంది. ఈ శుభతరుణానికి స్వాగతమా అన్నట్లు.. ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా పిన్నలు, పెద్దలు, బంధుమిత్రులు హోలీ పండగను ఆనందోత్సాహాలతో జరుపుకొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు జల్లుకున్న వేళ.. ఊరూవాడా రంగుల హరివిల్లులా.. సమస్తవర్ణాలతో నూత్న శోభను సంతరించుకుంది.
– సాక్షి, రాజమహేంద్రవరం
Comments
Please login to add a commentAdd a comment