రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
తుని: రేగుపాలెం–ఎలమంచిలి స్టేషన్ల మధ్య రైలు నుంచి జారిపడిన సంఘటనలో సుమారు 50 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్టు తుని జీఆర్పీ ఇన్‌చార్జి ఎస్సై ఎన్.రవికుమార్ తెలిపారు. సోమవారం ఆయనకు అందిన సమాచారం మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడు తెలుపు, నీలం, నలుపు గడుల పొట్టి చేతుల చొక్కా, నీలం రంగు ప్యాంటు ధరించి, మాసిన గెడ్డంతో ఉన్నాడు. మెడలో తాయెత్తులు ఉన్నాయి. మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. వివరాలు తెలిసిన వారు తుని జీఆర్పీ పోలీసులకు సమాచారం అందజేయాలని ఆయన కోరారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment