ప్రశాంతంగా ప్రారంభం
● మొదలైన పదో తరగతి పరీక్షలు
● 23,523 మంది హాజరు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 134 కేంద్రాల్లో పేపర్–1లో తెలుగు, సంస్కృతం, హిందీ పరీక్షలు జరిగాయి. పరీక్షల తొలి రోజు కావడంతో ఏ కేంద్రం వద్ద చూసినా విద్యార్థులు, తల్లిదండ్రుల హడావుడే కనిపించింది. విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకుని, తమ హాల్ టికెట్ నంబర్ ఆధారంగా రూములు వెతుక్కున్నారు. ఉదయం 9.30కు పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు పరీక్షకు మొత్తం 23,984 మందికి గాను 23,523 మంది హాజరయ్యారు. ఒక పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, 11 కేంద్రాలను జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు, 64 కేంద్రాలను తనిఖీ అధికారులు సందర్శించారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకోలేదు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లోని జిరాక్స్ సెంటర్లను మూయించివేశారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన ఓఆర్‌ఎస్, ప్రాథమిక వైద్య సహాయం అందించేలా ఏర్పాట్లు చేశారు.
జాగ్రత్తలు తీసుకోండి
పదో తరగతి పరీక్షల నిర్వహణలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి అధికారులకు సూచించారు. రాజమహేంద్రవరం లాలాచెరువు మున్సిపల్ హైస్కూలును ఆమె, జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు తనిఖీ చేశారు. మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్ష కేంద్రంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా పరీక్షలు సజావుగా నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో పాఠశాల విద్యా శాఖాధికారి కె.వాసుదేవరావు కూడా పాల్గొన్నారు.
ప్రశాంతంగా ప్రారంభం
ప్రశాంతంగా ప్రారంభం
ప్రశాంతంగా ప్రారంభం
ప్రశాంతంగా ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment