
నేర పరిశోధనల్లో టెక్నాలజీ కీలకం
అమలాపురం టౌన్: నేర పరిశోధనల్లో సాంకేతిక పరిజ్ఞానం కీలకమయ్యేలా దర్యాప్తులు, విచారణలు ఉండాలని ఏలూరు రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) జీవీకే అశోక్‌కుమార్ జిల్లా పోలీస్ శాఖకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా అమలాపురంలోని జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని మంగళవారం ఐజీ సందర్శించారు. ఎస్పీ కార్యాలయంలోని అడ్మిషనిస్ట్రేటివ్ విభాగాన్ని ఐజీ పరిశీలించారు. ఆ విభాగంతోపాటు జిల్లా క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (డీసీఆర్‌బీ), జిల్లా ట్రాఫిక్ రికార్డ్స్ బ్యూరో (డీటీఆర్‌బీ), స్పెషల్ బ్రాంచి విభాగాల రికార్డులను ఐజీ తనిఖీ చేశారు. ఎస్పీ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కంట్రోల్ రూమ్‌ను, సోషల్ మీడియా విభాగాన్ని ఐజీ పరిశీలించి సిబ్బంది పని తీరుపై ఆరా తీశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర పరిశోధనల్లో విరివిగా వాడాలని, జిల్లాలో క్రైమ్ రేటు తగ్గించడంలో సాంకేతిక ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీ కార్యాలయం పనితీరు మెరుగ్గా ఉంటేనే జిల్లాలోని శాంతి భద్రతల పరిరక్షణ, సాంకేతిక పరిజ్ఞానంతో నేర పరిశోధన, క్రైమ్ రేటు తగ్గుదల, చోరీలకు గురైన సొత్తుల రికవరీ అనేవి సాకారమవుతాయని ఐజీ అశోక్‌కుమార్ జిల్లా పోలీస్ శాఖకు స్పష్టం చేశారు. ఎస్పీ కృష్ణారావు, ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్, ఎస్పీ కార్యాలయ వివిధ విభాగాల సీఐలు బి.రాజశేఖర్, జి.వెంకటేశ్వరరావు, వి.శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఎస్పీ కార్యాలయ రికార్డులు తనిఖీ చేసిన ఐజీ అశోక్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment