తప్పిపోయిన బాలుడు తండ్రి చెంతకు..
సామర్లకోట: స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్‌లో మంగళవారం మధ్యాహ్నం అనుమానంగా తిరుగుతున్న ఏడేళ్ల బాలుడిని ట్రాఫిక్ ఎస్సై అవుట్ పోస్టు పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చి వివరాలు సేకరించి సుమారు మూడు గంటల తరువాత తండ్రి చెంతకు చేర్చిన ఘటన ఇది. ట్రాఫిక్ ఎస్సై అడపా గరగారావు కథనం ప్రకారం బాలుడు మన్ను దాసు తండ్రి గణేష్ దాస్ ఏడీబీ రోడ్డులోని అపర్ణ టైల్స్‌లో పని చేస్తూ సమీపంలో నివాసం ఉంటున్నారు. తల్లి ఒడిశా వెళ్లడంతో ఒంటరిగా ఇంటి వద్ద ఉన్న కుమాడికి తండ్రి సెల్‌ఫోన్ ఇచ్చాడు. దాంతో ఆడుకొంటూ నడుచుకొంటూ రైల్వే స్టేషన్ సెంటర్‌కు చేరుకున్నాడు. అనుమానంగా తిరుగుతున్న మన్ను దాసును ప్రశ్నిస్తే అడ్రసు చెప్పలేక పోవడంతో బాలుని వద్ద ఉన్న సెల్ ఫోన్ పరిశీలించగా చార్జింగ్ అయిపోయిందన్నారు. దాంతో ఆసెల్‌లోని సిమ్ తీసి వేరే ఫోనులో వేసి బంధువులకు ఫోన్ చేసి వివరాలు సేకరించామన్నారు. బాలుడు తండ్రికి సమాచారం ఇవ్వడంతో మంగళవారం సాయంత్రం అవుట్‌పోస్టు పోలీసు స్టేషన్‌కు చేరుకున్నాడు. అతడికి బాలుడిని క్షేమంగా ట్రాఫిక్ ఎస్సై అప్పగించారు.
పోలీసుల అదుపులో అనుమానితుడు
కాకినాడ క్రైం: కాజులూరు స్టేట్ బ్యాంక్ సమీపంలో తుపాకీతో సంచరిస్తున్న ఓ అనుమానితుడిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. తిమ్మాపురం పోలీసులు కాకినాడకు తరలించగా రూరల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో సీఐ చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. ఆ వ్యక్తి బ్యాంకు దోపిడీకి రెక్కీ నిర్వహిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. విచారణలో అందుకు తగ్గ ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ నేపథ్యంలో జరగబోయే నేరాన్ని ముందుగానే గుర్తించామని పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారంపై బుధవారం ఎస్పీ బిందుమాధవ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment