ప్రాణాన్ని బలిగొన్న వారిని అరెస్ట్ చేయాలి
సఖినేటిపల్లి: స్థానిక సినిమాహాల్ సెంటర్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో నిండు ప్రాణాన్ని బలిగొన్న వ్యక్తులను తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబ సభ్యులు ఽమంగళవారం పోలీసు స్టేషన్ వద్ద ధర్నా చేశారు. వీరికి సంఘీభావంగా ఒలుపు, దింపు కార్మికులు, కొబ్బరి రైతులు, ప్రముఖులు సరెళ్ల విజయ్ ప్రసాద్, గొల్లమందల చిట్టిబాబు, రుద్రరాజు చిన రాజా, రాపాక మహేష్, కుసుమ చింటూ పాల్గొన్నారు. గుడిమూలలో నివాసం ఉంటూ, తునికి చెందిన బత్తిన పైడిరాజు(23) కొబ్బరి దింపులు తీస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. సఖినేటిపల్లిలో రోడ్డు పక్క బైక్‌పై ఆగి ఉన్న పైడిరాజును, ఎదురుగా అతివేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. దీంతో పైడిరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇందుకు కారకులైన కారులోని నలుగురిని అరెస్ట్ చేయాలని, నిరుపేద అయిన పైడిరాజు కుటుంబానికి తగిన న్యాయం చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. చేతికి అందివచ్చిన కొడుకు మృతి చెందడంతో తండ్రి బత్తిన బంగార్రాజు కన్నీరు మున్నీరుగా విలపించాడు. రోడ్డు ప్రమాదంపై ఇప్పటికే నమోదైన కేసు ఆధారంగా అన్ని కోణాలలో దర్యాప్తు సాగుతోందని, చట్టప్రకారం బాధ్యులపై చర్యలు ఉంటాయని ఎస్సై కె.దుర్గా శ్రీనివాసరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment