మతి స్థిమితం లేని గుర్తు తెలియని వ్యక్తి మృతి
తాళ్లపూడి: మండలంలోని పెద్దేవం శివారు రావూరుపాడు బస్టాండ్ వద్ద మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్టు తాళ్లపూడి ఎస్సై టి.రామకృష్ణ తెలిపారు. మృతుడి వయస్సు 40 నుంచి 45 సంవత్సరాలు ఉంటాయని తెలిపారు. నాలుగు రోజులుగా ఇక్కడే ఉంటూ పరిసర ప్రజలు పెట్టిన ఆహారం తింటూ ఉన్నాడని అన్నారు. ఈ క్రమంలో మృతి చెందిన వ్యక్తి మతిస్థిమితం సరిగ్గా లేని వ్యక్తిగా ఉన్నట్టు సమాచారం. ఇతనికి సంబంధించిన వివరాలు తెలిస్తే తాళ్లపూడి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై రామకృష్ణ తెలిపారు.
కొట్లాట కేసులో
ఆరు నెలల జైలు
తుని రూరల్: తుని మండలం హంసవరం గ్రామానికి చెందిన మాసా సింహాచలంకు తుని జేఎఫ్‌సీఎం కోర్టు జడ్జి ఆరు నెలలు జైలు శిక్ష, రూ.పది వేలు జరిమానా విధించినట్టు రూరల్ ఎస్సై బి.కృష్ణమాచారి మంగళవారం తెలిపారు. 2021లో గ్రామంలో జరిగిన కొట్లాటపై అప్పటి ఎస్సై వై.గణేష్ కుమార్ కేసు నమోదు చేశారన్నారు. సింహాచలంపై నేరం రుజువు కావడంతో శిక్ష విధించినట్టు ఆయన తెలిపారు. రూరల్ సీఐ జి.చెన్నకేశవరావు ఆధ్వర్యంలో తన సూచనల మేరకు కోర్టు కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం సాక్షులను ప్రవేశపెట్టగా ఏపీపీ లక్ష్మీదేవి కేసు వాదించినట్టు ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment