వందేళ్ల వృద్ధురాలి కన్నుమూత
నల్లజర్ల: ప్రకాశరావుపాలెంలో వృద్ధురాలు గోగులమండ సుందరమ్మ(100) బుధవారం ఉదయం కన్నుమూశారు. మరణించే వరకూ ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని బంధువులు తెలిపారు. ఆమెకు ఐదుగురు మగ, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. నలుగురు కుమారులు వివిధ శాఖల్లో గెజిటెడ్ హోదాల్లో పనిచేస్తున్నారు. నాలుగో కుమారుడు గోగుల మండబాబ్జీ వైఎస్సార్ సీపీ లీగల్‌సెల్ మండల అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఆమె భర్త వీరాస్వామి కమ్యూనిస్టు ఉద్యమ నేతగా వ్యవహరించారు.
మహిళ మెడలో గొలుసు చోరీ
కొవ్వూరు: ఈవెనింగ్ వాకింగ్ చేస్తున్న మహిళ మెడ నుంచి బంగారు గొలుసును దొంగ అపహరించిన ఉదంతమిది. పట్టణంలోని 23వ వార్డుకు చెందిన కుందుల పద్మకుమారి స్థానిక బైపాస్ రోడ్డు బుధవారం ఈవెనింగ్ వాకింగ్‌కు బయలుదేరింది. మోటార్ బైక్‌పై వచ్చిన దొంగ ఆమె మెడలో ఉన్న ఆరున్నర కాసుల బంగారు గొలుసును తెంచుకుని పరారయ్యాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ జి.దేవకుమార్, పట్టణ సీఐ పి.విశ్వం సంఘటన స్థలానికి చేరుకుని, బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ విశ్వం తెలిపారు. గతంలో కొవ్వూరు పట్టణంలో రెండు చైన్ స్నాచింగ్ సంఘటనలు చోటుచేసుకున్నాయి.
వందేళ్ల వృద్ధురాలి కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment