మతాతీతంగా మాతకు ఆరాధన
దేవరపల్లి: ఉభయగోదావరి జిల్లాల్లో ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది నిర్మలగిరి పుణ్యక్షేత్రం. ఇక్కడి మేరీమాతను నిత్య నిష్కళంక మాతగా, మత భేదమెరుగని తల్లిగా అన్ని మతాల వారు ఆరాధిస్తున్నారు. ఈ నెల 22 నుంచి 25 వరకు మేరీ మాత ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఏలూరు పీఠాధిపతి జయరావు పొలిమెర పర్యవేక్షణలో పుణ్యక్షేత్రం డైరెక్టర్ ఫాదర్ ఎస్.జాన్‌పీటర్, ఉత్సవాల నిర్వహణ కమిటీ, సహాయక ఫాదర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామానికి ఆనుకుని ఈ క్షేత్రం ఉంది. క్షేత్రం ఆవిర్భావానికి 1978లో అప్పటి ఏలూరు పీఠాధిపతి జాన్ ములగాడ నాంది పలకగా పలువురు ఫాదర్లు పుణ్యక్షేత్రం అభివృద్ధికి పాటుపడ్డారు. ప్రస్తుత డెరెక్టర్ ఫాదర్ జాన్‌పీటర్ పుణ్యక్షేత్రాన్ని సర్వాగ సుందరంగా తీర్చిదిద్దారు. కులమతాలకు అతీతంగా భక్తులు మేరీమాతను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చి తమ కోర్కెలను మరియతల్లికి విన్నవించుకుంటారు.
1978లో బిషప్ జాన్‌ములగాడ గౌరీపట్నంలో నిర్మలగిరి క్షేతాన్ని నిర్మించాలని సంకల్పించారు. 1976లో ఏలూరు బలిపీఠం ఏర్పడింది. జాన్ ములగాడ తొలి పీఠాధిపతిగా నియమితులయ్యారు. అనంతరం బిషప్ ములగాడ కారులో విశాఖపట్నం వెళుతుండగా గౌరీపట్నం వద్ద కారు మరమ్మతులకు గురైయింది. కారు దిగి జాన్‌ములగాడ చుట్టూ పరిశీలించారు. ఎత్తైన కొండలు, కారుచీకటి, ముళ్లపొదలతో నిండి ఉన్న చిట్టడవి. భయంకర వాతావరణం. అంతలోనే ములగాడ మనసులో ప్రేరణ. ఈ ప్రాంతంలో ఆలయం నిర్మించవా అంటూ ప్రేరణ కలిగింది. కారు మరమ్మతులు చేయించుకుని విశాఖపట్నం బయలుదేరారు. 1978లో గౌరీపట్నం ప్రాంతంలో మేరీమాత ఆలయం నిర్మణానికి సంకల్పం చేశారు. 1979లో ఆలయ నిర్మాణం చేసి ఫాదర్ మైకేల్‌ను తొలి డైరెక్టర్‌గా నియమించారు.1982 నుంచి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 1992లో ఫాదర్ దిరిసిన ఆరోన్ పుణ్యక్షేత్రం డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. 1995లో పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణం కల్పించడానికి ప్రేమసేవా ఆశ్రమం ఏర్పాటు చేశారు.
2000లో అఖండ దేవాలయం నిర్మాణం
క్షేత్రంలో అఖండ దేవాలయం నిర్మాణానికి 1992లో శంకుస్థాపన చేశారు. 2000లో ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. ఒకేసారి దాదాపు 5,000 మంది ప్రార్థనలు చేసుకొనేందురు వీలుగా దేవాలయం నిర్మించారు. క్షేత్రంలో కళాత్మకంగా పలు కట్టడాలను ఏర్పాటు చేశారు.
ప్రేమ సేవా ఆశ్రమం
1995 జూలైలో ప్రేమసేవా ఆశ్రమాన్ని నిర్మలగిరిలో నెలకొల్పారు. మఠవాసులను తీర్చిదిద్దే బాధ్యత జేసురాజన్ చేపట్టారు. బ్రహ్మచర్య వ్రత నియమాలు పాటిస్తూ ప్రభువు సువార్తను ప్రకటించే పరిచర్య ఇక్కడే ఆరంభమవుతుంది. సేవ చేయాలనే ఉత్సహం ఉన్న యువతీ, యువకులు ఏడాది పాటు మఠంలో ఉండవచ్చును. 1997లో నిర్మల హృదయ మహిళా కళాశాలను బిషప్ ములగాడ ప్రారంభించారు.
అనురాగ ఆశ్రమం ఏర్పాటు
నిర్మలగిరి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా పుణ్యక్షేత్రానికి ఎదురుగా సుమారు 100 అడుగుల ఎత్తున సుందరమైన క్రీస్తు మందిరాన్ని నిర్మాణం చేశారు. చరిత్రలోని వివిధ ఘట్టాలను కళాత్మకంగా గోపురంలో పొందుపర్చారు.
నిత్య అన్నదానం
పుణ్యక్షేత్రానికి నిరంతరం వస్తున్న భక్తులకు నిత్య అన్నదానం చేస్తున్నారు. ప్రతి రోజు సుమారు 2 వేల మంది భక్తులకు ఉచితంగా అన్నదానం చేస్తున్నారు. అన్నదానం కాంట్రాక్టర్ కళ్ళే నాగేశ్వరరావు పర్యవేక్షణలో జరుగుతుంది.
గౌరీపట్నం నిర్మలగిరి పుణ్యక్షేత్రంలోని
అఖండ దేవాలయం
రేపటి నుంచి
నిర్మలగిరి మేరీ మాత ఉత్సవాలు
సుందరంగా ముస్తాబైన పుణ్యక్షేత్రం
అఖండ దేవాలయం
సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు
అగ్ర పీఠాధిపతుల రాక
10 లక్షల మంది భక్తుల వచ్చే అవకాశం
వివిధ ప్రాంతాల నుంచి
ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
ఏటా మార్చిలో ఉత్సవాలు
ఏటా మార్చి 22 నుంచి 25 వరకు మేరీమాత ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో పుణ్యక్షేత్రంలోని పలు ప్రదేశాల్లో నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. భక్తుల రక్షణకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. మతాలకు అతీతంగా భక్తులు ఉత్సవాల్లో పాల్గొని కొబ్బరికాయలు కొట్టి, కొవ్వొత్తులను వెలిగించి, తలనీలాలు సమర్పించి దైవదూత అనుగ్రహం కోసం ప్రార్థిస్తారు. ఉత్సవాల్లో భాగంగా దివ్య బలిపూజలు, దివ్య సత్ప్రసాద ఆరాధనలు నిర్వహిస్తారు. వాటికన్ భారత రాయబారి, ప్రాన్సిస్ మోస్ట్ రెవరెండ్ లియోపోల్డో జిరెల్లి పుణ్యక్షేత్రంలో 2022లో జరిగిన ఉత్సవాల్లో పాల్గొని ప్రార్థనలు చేశారు. ఉత్సవాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment