కన్న బిడ్డలను కాలువలో తోసేసిన తండ్రి లొంగుబాటు
రామచంద్రపురం రూరల్: కన్న బిడ్డలను తండ్రే కాలువలోకి తోసేసి ఊపిరి తీయాలని చూసిన ఘటన పాఠకులకు తెలిసిందే. ఈ సంఘటనలో ఏడేళ్ల కుమార్తె కారుణ్యశ్రీ మృతి చెందగా, 10 ఏళ్ల కుమారుడు రామ సందీప్ ప్రాణాలతో బయట పడ్డాడు.. ఆ తరువాత అతడు కూడా ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అందరూ భావించారు. పోలీసులూ అదే కోణంలో కాలువలు, గోదావరిలో గాలించారు. దీనికితోడు నిందితుడు పిల్లి రాజు ఉపయోగించే స్కూటర్ యానాం బ్రిడ్జిపై లభించడంతో గోదావరిలో దూకేశాడని మరింత తీవ్రంగా గోదావరిలో బోట్లు వేసుకుని గాలించారు. అయితే అనూహ్యంగా అతడు మండపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం లొంగిపోయాడు. దీంతో రామచంద్రపురం డీఎస్పీ బి.రఘువీర్ గురువారం తన కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టి నిందితుడిని మీడియా ముందుకు తీసుకువచ్చారు. డీఎస్పీ మాట్లాడుతూ అప్పుల ఒత్తిడితోనే తాను చనిపోతే తన పిల్లలు అనాథలు అయిపోతారని భావించి ముందుగా పిల్లలను నెలపర్తిపాడు శివారు గణపతినగరం వద్ద పంట కాలువలోకి తోసేసి, తానూ ఆత్మహత్య చేసుకోవడానికి యానాం గోదావరి బ్రిడ్జిపై నుంచి దూకేయాలని వెళ్లాడని, అయితే అక్కడ మనసు మార్చకొని రాథేయపాలెంలో బంధువుల ఇంటికి వెళ్లాడు. బంధువులు పోలీసులకు లొంగిపోవాలని సూచించడంతో మండపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం వెళ్లి లొంగిపోయాడు. ప్రెస్‌మీట్‌లో రామచంద్రపురం సీఐ ఎం.వెంకటనారాయణ, ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్, రామచంద్రపురం ఎస్సై ఎస్.నాగేశ్వరరావు, కె.గంగవరం ఎస్సై ఎస్‌కే జానీబాషా, సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు.
మీడియా ముందుకు
తీసుకుని వచ్చిన పోలీసులు
అప్పుల బాధతోనే
అఘాయిత్యానికి పాల్పడినట్లు వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment