నేత్రాలకు చల్లని నేస్తాలు! | - | Sakshi
Sakshi News home page

నేత్రాలకు చల్లని నేస్తాలు!

Published Sat, Mar 22 2025 12:14 AM | Last Updated on Sat, Mar 22 2025 12:14 AM

నేత్ర

నేత్రాలకు చల్లని నేస్తాలు!

కూలింగ్‌ కళ్లద్దాలతో కంటికి రక్షణ

రోజు రోజుకూ పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతలు

కూలింగ్‌ గ్లాస్‌ కళ్లజోడుతో ఎండలో

ప్రయాణం శ్రేయస్కరం

జాగ్రత్తలు సూచిస్తున్న కంటి వైద్య నిపుణులు

కొత్తపేట: వేసవిలో శరీరంతో పాటు కళ్లమీద కూడా శ్రద్ధ చూపడం చాలా మంచిది. శరీరానికి వేడి చేయకుండా ఎప్పుడూ చల్లదనంలో ఆరోగ్య స్థితి మెరుగ్గా ఉండాలని జాగ్రత్తలు తీసుకుంటాం. గొంతెండిపోతే గుక్కెడు నీరు గానీ, శీతల పానీయాలు గానీ సేవించి సేద తీరుతాం. కానీ కళ్ల గురించి మాత్రం అంతలా పట్టించుకోం. కళ్లు పట్ల అశ్రద్ధ, నిర్లక్ష్యం కంటి వ్యాధులకు కారణమవుతాయి. వేసవిలో సరైన కంటి జాగ్రత్తలు తీసుకోకపోతే అపాయమేనని నేత్ర వైద్యులు చెబుతున్నారు. అత్యవసర సమయంలో ఎండలో తిరిగే ప్రతి ఒక్కరూ కూలింగ్‌ గ్లాసెస్‌ తప్పనిసరిగా వాడాలని చెబుతున్నారు. చలువ కళ్లజోళ్లు వాడడం వల్ల ఎండ వేడిమి నుంచి కళ్లను కాపాడుకోవచ్చని నేత్ర వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

చూపు మందగించే ప్రమాదం

కళ్లలోని అతి సున్నితమైన భాగాలకు వేడి తగలడం వల్ల చూపు మందగించే ప్రమాదం ఉంది. శరీర భాగాల్లో కళ్లు ఎంతో సున్నితమైనవి. ప్రధానమైనవి. మిట్ట మధ్యాహ్నం లేదా ఉష్ణ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో ప్రయాణం చేయడం కంటికి మంచిది కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో వాహనం నడిపితే హెల్మెట్‌ లేదా కళ్లజోడును తప్పనిసరిగా పెట్టుకోవాలి. దుమ్ము, ధూళి కంటిలో పడడం వల్ల విపరీతమైన కంటి దురదలు ఏర్పడతాయి. నల్లగుడ్డు చుట్టూ పొరలు రావడం. ఎరన్రి చారలు, కంటి వెంట తీగలాంటి స్రావం కారడం జరుగుతుంది. ఇటువంటి సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఒక్కోసారి జీవితాంతం చూపు కోల్పోయే ప్రమాదం ఉంది.

నలపకూడదు

మధ్యాహ్నం సమయంలో ఎండ చాలా తీవ్రంగా ఉంటుంది కళ్లకు రక్షణ కవచాలు లేకుండా తిరిగితే మంట పుట్టడంతో పాటు కళ్లు ఎరబ్రడ తాయి. ఇటువంటి సందర్భాల్లో కళ్లను చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. వెంటనే సమీపంలోని ఉన్న నేత్ర వైద్యులను సంప్రదించాలి. కళ్లను నలపడం చేయరాదు. తీవ్రమైన ఎండలో బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడల్లా సన్‌ గ్లాసెస్‌ ఉపయోగించాలి. బైక్‌, కారు లేదా మరేదైనా వాహనం నడుపుతున్నప్పుడు సన్‌ గ్లాసెస్‌ ధరించడం వల్ల దుమ్ము కణాలు లేదా వేడి గాలి కళ్లలోకి రాకుండా చేస్తుంది. ద్విచక్ర వాహనదారులు వీలైనంత వరకు క్లోజ్డ్‌ హెల్మెట్‌లను వాడటం మంచిది. 100% యూవీ రక్షణను అందించే నాణ్యమైన సన్‌ గ్లాసెస్‌ని వాడాలి. యూవీ కిరణాలు కళ్ళను దెబ్బతీస్తాయి. ఇది కంటి శుక్లం, మాక్యులార్‌ డీజెనరేషన్‌ వంటి సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి యూవీఏ, యూవీబీ కిరణాలను నిరోధించే సన్‌ గ్లాసెస్‌ ఉపయోగించాలి.

కంటి చూపు మెరుగు కోసం ఆహారం

కంటి చూపు మెరుగుపరుచుకోవడానికి సమతుల ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రధానంగా తీసుకునే ఆహారంలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు. ఎ, సి విటమిన్లు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఆకుకూరలు అధికమొత్తంలో తీసుకోవాలి. ఎందుకంటే ఇవి పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. పాలకూర వంటివి కూడా కంటి ఆరోగ్యానికి బాగా సహాయపడతాయి. అలాగే ఒమెగా–3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే చేపలు తీసుకోవాలి. ఇవి కంటి చూపు మెరుగు పడేందుకు దోహదపడతాయి.

జాగ్రత్తలు పాటించాలి

వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వెలుగును తట్టుకోలేని స్థితి ఈ కాలానికి ఉంది. జీవన ఉపాధి దృష్ట్యా ఎక్కువగా ఎండ బారిన పడిన వారు వారి విధుల మూలంగా ద్విచక్రవాహనాలపై ప్రయాణించినప్పుడు, రోడ్లపై వెళ్లేటప్పుడు వేసవిలో ఎండ ప్రభావంతో వచ్చిన వెలుతురు, వేడికి కళ్లకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వాళ్ల కళ్లలోని రక్షణ పొర కరిగిపోయి, వారి కళ్లు ఫొటో సెన్సిటివిటీకి గురవుతాయి. దాంతో కళ్లు మరింత సున్నితమైపోయి, క్రమేపీ వెలుగును చూడలేని స్థితికి చేరుకుంటాయి. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా బయటకు వెళ్లినప్పుడల్లా చలువ కళ్లద్దాలను, హెల్మెట్‌ లేదా క్యాప్‌ ధరిస్తూ జాగ్రత్తలు పాటించాలి.

– డాక్టర్‌ కె.శేషగిరిరావు,

ప్రముఖ కంటి వైద్యుడు, కొత్తపేట

No comments yet. Be the first to comment!
Add a comment
నేత్రాలకు చల్లని నేస్తాలు!1
1/2

నేత్రాలకు చల్లని నేస్తాలు!

నేత్రాలకు చల్లని నేస్తాలు!2
2/2

నేత్రాలకు చల్లని నేస్తాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement