
మెడికల్ షాపుల్లో ‘విజలెన్స్’ తనిఖీలు రికార్డులు సక్రమ
అమలాపురం టౌన్: స్థానికంగా ఉన్న పలు మెడికల్ షాపులపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, డ్రగ్స్, వాణిజ్య పన్నులు, లీగల్ మెట్రాలిజీ శాఖల అధికారులు మూకుమ్మడిగా, ఆకస్మికంగా శుక్రవారం దాడులు నిర్వహించారు. పట్టణంలోని ఎ టు జెడ్, మోహన్, లీలాశ్రీ, శ్రీదేవి మెడికల్ షాపుల్లో ఆ నాలుగు శాఖలకు చెందిన అధికారుల బృందం దాడులు నిర్వహించాయి. మెడికల్ షాపుల్లో ఎక్కడా ఎలాంటి నిషేధిత మందులు లభ్యం కాలేదని విజిలెన్స్ సీఐ మధుబాబు తెలిపారు. నాలుగు మెడికల్ షాపుల్లో మందుల కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించిన రికార్డులు సక్రమంగా నిర్వహించడం లేదని అధికారులు గుర్తించారు. వాటిపై చర్యలకు సిఫారసు చేస్తూ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ మురళీ తమ శాఖ ఏడీకి లేఖ రాశారు. త్వరలోనే ఈ షాపులకు షోకాజ్ నోటీసులు రానున్నాయని అధికారులు తెలిపారు. తనిఖీలు ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిర్వహించారు. తనిఖీల్లో పోలీస్ అధికారులు కూడా పాల్గొన్నారు. అధికారుల ఆకస్మిక దాడుల భయంతో పట్టణంలోని మిగిలిన మెడికల్ షాపులు, మెడికల్ ఏజెన్సీలకు చెందిన షాపులను ముందు జాగ్రత్తగా మూసివేశారు. ఈ దాడుల్లో డీసీటీవో నవీన్‌కుమార్, లీగల్ మెట్రాలిజీ ఇన్‌స్పెక్టర్ మురళీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment