అనర్హులే పట్టు సాధించారు
ఫ అర్హులకు అందని ప్రోత్సాహం
ఫ చేబ్రోలు పట్టు పరిశ్రమ
అధికారుల మాయాజాలం
ఫ ఆందోళన చేపట్టిన రైతలు
పిఠాపురం: అనర్హులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నా రని మల్బరీ రైతులు ఆందోళనకు దిగారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు పట్టు పరిశ్రమ అధికారులు సిఫార్సులకు ప్రాధాన్యమిచ్చి అర్హులను విస్మరించారని రైతులు ఆరోపిస్తున్నారు. 53.19 ఎకరాల్లో 26 మంది రైతులను గుర్తించి, ఇందులో 20 ఎకరాలు దాటి మల్బరీ సాగు చేయలేదని రైతులు వాపోయారు. నువ్వులు ఇతర పంటలు సాగు చేసిన వారికి కూడా మల్బరీ నర్సరీ ప్రోత్సాహం ఎకరానికి 22,500 చొప్పు న ఇస్తున్నారని, ఇందులో అర ఎకరం సాగు చేసిన వా రికి కూడా రెండు నుంచి నాలుగు ఎకరాలలో వేసినట్టు నమోదు చేశారని పట్టు రైతులు ఆరోపించారు.
అనర్హులకు పరిహారం
గత ఏడాది గూళ్లు నష్టపోయిన వారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూ.11,30,000 సహాయం అందించినప్పటికీ అధికారులకు నచ్చిన రైతులకే పరిహారం అందించారని, మిగిలిన వారిని వదిలేసారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇన్‌సెంటీవ్‌లు కూడా సీరియల్ పాటించట్లేదని వారు పేర్కొన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా ఇష్టం వచ్చిన వారి పేర్లు నమోదు చేసి, అర్హులకు మొండిచేయి చూపారని రైతులు ఓరుగంటి చక్రధర్ రావు, సూరిబాబు, ఉలవల సురేష్, చక్రి వెలుగుల మాణిక్యం తదితరులు కోరుతున్నారు.
అధికారులు అన్యాయం చేశారు
గత ఏడాది నాలుగు ఎకరాల్లో మల్బరీ సాగు చేపట్టాను. గూళ్లు సక్రమంగా రాకపోవడంతో పట్టు పరిశ్రమ అధికారుల సూచనతో పంట తొలగించి నువ్వు చేను వేశాను. గుళ్లు కట్టిన రైతులకు అప్పటి ప్రభుత్వం నష్టపరిహారం అందించింది. అందులో కూడా తనను గుర్తించలేదు. నర్సరీ వేసిన వెంటనే ఎకరానికి 22,500 చొప్పున ఇవ్వాల్సిన ప్రోత్సాహం కూడా అందించలేదు. అధికారుల నిర్వాకం వల్ల రూ.మూడు లక్షల వరకు నష్టపోయాను.
– ఓరుగంటి సూరిబాబు, పట్టు రైతు చేబ్రోలు
అర్హులకే ఇస్తున్నాం
మల్బరీ సాగు చేసిన రైతులనే నర్సరీ ప్రోత్సాహకాలు అందించడానికి గుర్తించాం. అలాగే గూళ్లు నష్టం కూడా కొంతమంది రైతులకు అందకపోవటం వాస్తవమే. వారిని రెండో జాబితాలో పెట్టాము. అది ప్రభుత్వం నుంచి ఇంకా రాలేదని ఇన్‌సెంటీవ్ పాత సీరియల్ ప్రకారమే అందిస్తాం. ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో ఆ రైతులు ఎనిమిది ఎకరాలు మల్బరీ సాగు చేసినప్పటికీ ఇప్పుడు నువ్వు చేలు వేసుకున్నారు.
– టి.మోసయ్య, పట్టు పరిశ్రమ అధికారి, చేబ్రోలు
అనర్హులే పట్టు సాధించారు
అనర్హులే పట్టు సాధించారు
Comments
Please login to add a commentAdd a comment