నేడు రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పోటీలు
పరుగుకు సిద్ధమైన 45 జతల ఎడ్లు
సామర్లకోట: స్థానిక ఉండూరు రైల్వే గేటు వద్ద ఎన్‌ఎఫ్‌సీఎల్ రోడ్డులో ఆదివారం రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పోటీలు జరుగుతున్నాయి. ఈ మేరకు సీనియర్ విభాగం నుంచి 8 జతలు, జూనియర్ విభాగం నుంచి 37 జతల ఎడ్లు కృష్ణ, ప్రకాశం, నెల్లూరు, విశాఖ, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల నుంచి ఉండూరుకు చేరుకున్నాయి. శ్రీ కుమార రామభీమేశ్వర ఎడ్ల పరుగు పోటీలు వల్లూరి సత్యేంద్రకుమార్ మెమోరియల్ పేరుతో ఎడ్ల పరుగు పోటీల్లో పాల్గొనే రైతులే ఏర్పాటు చేయడం విశేషం. మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ చందలాడ అనంత పద్మనాభం పోటీలను ప్రారంభిస్తారని నిర్వాహకులు వల్లూరి దొరబాబు, సీతారామరాజు, బిక్కిన రంగనాయకులు, చేకూరి రామకృష్ణ, మలిరెడ్డి వీరేంద్రలు తెలిపారు. సీనియర్ విభాగంలో మూడు, జూనియర్ విభాగంలో ఐదు బహుమతులను ఇవ్వనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. సీనియర్ విభాగంలో కిలోమీటరున్నర, జూనియర్ విభాగంలో కిలోమీటరు దూరాన్ని ఎడ్లు పరుగెట్టాల్సి ఉంటుందన్నారు.
బాలికలపై వ్యక్తి అత్యాచారయత్నం
పెద్దాపురం: ఇద్దరు బాలికలపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు. స్థానికుల కథనం మేరకు శనివారం స్థానిక దర్గా సెంటర్‌లో వ్యాపారం చేసుకుంటున్న కామేశ్వరరావు రెండు, ఏడో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలికల అరుపులతో స్థానికు లు అక్కడికి చేరుకుని దేహశుద్ధి చేసి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడు అక్కడ చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ఎస్‌ఐ మౌనికను వివరణ కోరగా తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
నేడు రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పోటీలు
Comments
Please login to add a commentAdd a comment