ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ
● ఐదు కాసుల బంగారు నగలు,
● 300 గ్రాముల వెండి వస్తువుల
అపహరణ
పి.గన్నవరం: మండలంలోని ఊడిమూడి శివారు ఆదిమూలం వారిపాలెంలో దొంగలు ఒక ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలోని ఐదు కాసుల బంగారు నగలు, 300 గ్రాము ల వెండి వస్తువులను చోరీ చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని ఆదిమూలం రాజరాజేశ్వరి 15 రోజుల క్రితం హైదరాబాద్‌లోని కుమార్తె ఇంటికి వెళ్లారు. ఆమె సోదరుడు ఊడిమూడికి చెందిన కొండ్రెడ్డి కాశీ విశ్వనాథ్ అప్పుడప్పుడూ వచ్చి రాజరాజేశ్వరి ఇంటిని పరిశీలించి వెళ్తున్నారు. గత సోమవారం చివరగా ఆమె ఇంటిని చూసి వెళ్లాడు. ఇటీవల అదే గ్రామంలోని చింతావారిపేటలో దొంగతనం జరిగిన నేపథ్యంలో.. శనివారం ఉదయం సోదరి ఇంటిని పరిశీలించేందుకు కాశీ విశ్వనాథ్ ఆ ఇంటికి వచ్చి వెనుక తలుపులు పగులగొట్టి ఉండటాన్ని గమనించి సోదరికి సమాచారం అందించారు. ఇంట్లోని బీరువాలు పగులగొట్టి, సామాన్లు చిందరవందరగా ఉండడం, బంగారు, వెండి వస్తువులతో పాటు, రూ.25 వేల నగదును తస్కరించినట్టు వారు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment