అధిక దిగుబడి వంగడాలు అందిస్తున్నాం
కొవ్వూరు: రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని, నూతన వంగడాలను అందిస్తున్నామని వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ (వీసీ) డాక్టర్ కె.గోపాల్ అన్నారు. స్థానిక వైఎస్సార్ ఉద్యాన పరిశోధన స్థానంలో శనివారం కిసాన్ మేళా నిర్వహించారు. తొలుత వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన కేంద్రాలను ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుతో కలసి ప్రారంభించారు. అనంతరం కిసాన్ మేళా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కొవ్వూరు పరిశోధన స్థానంలో అరటిపై ఆరేళ్లుగా విశేష పరిశోధనలు చేసి, రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందించామన్నారు. రాష్ట్రంలో అరటి ఉత్పత్తులు పెరగడానికి ఇది దోహదపడిందన్నారు. ఈ పరిశోధన స్థానం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందన్నారు. ఇక్కడ విత్తన పిలక ఎంపిక నుంచి యాజమాన్య పద్ధతులు, సస్య రక్షణ, సేంద్రియ సాగు, కోత అనంతరం పరిజ్ఞానం వంటి సమగ్ర సమాచారాన్ని రైతులకు అందిస్తున్నామని వివరించారు. రైతులకు టిష్యూ కల్చర్ మొక్కలు అందిస్తున్న సంస్థల్లో కొవ్వూరు ఒక్కటే ప్రభుత్వ రంగంలో ఉందన్నారు. ఈ పరిశోధన కేంద్రంలో రూపొందించిన సంప్రదాయ రకాలైన తెల్లర చక్కెరకేళీ, కర్పూర, ఎర్ర చక్కెరకేళీ, మార్టమన్, కొవ్వూరు బొంత, గోదావరి బొంత వంటి రకాలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయన్నారు. కావేరి కల్కి, పోపోవులు, ఫియా–3 వంటి అరటి రకాల్లో కూడా టిష్యూ కల్చర్ మొక్కలను అభివృద్ధి చేస్తున్నామని ప్రకటించారు. కొవ్వూరు పరిశోధన స్థానం నుంచి ఇప్పటి వరకూ 13 లక్షలకు పైగా టిష్యూ కల్చర్ మొక్కలను రైతులకు అందించామన్నారు. ఇక్కడ విడుదలైన కొవ్వూరు బొంత అనే కూర అరటి రకం ఎంతో ప్రాచుర్యం పొందిందన్నారు. దుంప పంటల్లో గజేంద్ర అనే తీపి కంద రకం, భావపురి, గోదావరి చేమతో పాటు శబరి అనే పెండలం రకాన్ని కూడా ఇక్కడి నుంచే విడుదల చేశామని వీసీ డాక్టర్ గోపాల్ చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కూడా ప్రసంగించారు. కార్యక్రమంలో ఉద్యాన పరిశోధన స్థానం డైరెక్టర్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్ బి.గోవిందరాజులు, ప్రిన్సిపల్ సైంటిస్టులు పి.లలితా కామేశ్వరి, డి.వెంకటస్వామి, శాస్త్రవేత్తలు ఎ.స్నేహలతారాణి, ఎంపీపీ కాకర్ల నారాయుడు, జెడ్పీటీసీ సభ్యులు బొంతా వెంకటలక్ష్మి, అర్బన్ బ్యాంకు చైర్మన్ మద్దిపట్ల శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
·˘ OÐðlGÝëÞÆŠ‡ E§éů]l Ð]lÇÞsîæ ÒïÜ Vø´ëÌŒæ
·˘ MöÐ]lNÓÆý‡$ ç³ÇÔZ«§ýl¯]l Ý릯]l…ÌZ
కిసాన్ మేళా
Comments
Please login to add a commentAdd a comment