కిక్కిరిసిన రత్నగిరి
అన్నవరం: పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం కిక్కిరిసింది. పరీక్షలు ముగియడంతో ఇంటర్ విద్యార్థులు, వారికి ఇతర భక్తులు తోడవడంతో సత్యదేవుని సన్నిధిలో రద్దీ ఏర్పడింది. స్వామివారి ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుని 30 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వ్రతాలు 1,600 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 4 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సెలవు రోజు కావడంతో ఆదివారం కూడా రత్నగిరిపై భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. ఆదివారం ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అమ్మవారిని టేకు రథంపై ఊరేగించనున్నారు.
ఘనంగా ప్రాకార సేవ
సత్యదేవుని ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి, తిరుచ్చి వాహనంపై వేంచేయించారు. అర్చకుల పూజల అనంతరం ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు కొబ్బరికాయ కొట్టి ప్రాకార సేవ ప్రారంభించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు నీరాజన, మంత్రపుష్పాలు సమర్పించి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment