కాలువలోకి దూకిన యువకుడు
పెరవలి: ఓ వ్యక్తి కాల్వలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర సంచలనం రేపింది.పెరవలి ఎస్‌ఐ ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెరవలి మండలం ఖండవల్లి గ్రామానికి చెందిన చల్లా దుర్గారావు (29) మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో పెరవలి లాకుల వద్దకు వచ్చి బండి, జోళ్లు విడిచిపెటి్‌ట్ కాల్వలోకి దూకేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న కొందరు దుర్గారావుకి వెదురుగెడ ఇచ్చినా, దానిని పట్టుకోకుండా నీట మునిగిపోయాడని తెలిపారు. స్థానికులు సమీపంలో ఉన్న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు తణుకు ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. అక్కడ నుంచి సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చారు. ఇదే సమయంలో పోలీసులు గజ ఈతగాళ్లను, వలలు వేసే వారిని రప్పించి వెతకటం ప్రారంభించారు. రాత్రి అవ్వటంతో వెతకటం నిలుపుదల చేశామని, బుధవారం ఉదయం తిరిగి వలలు వేస్తామని తెలిపారు. మృతుడి అన్న చల్లా వెంకట సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశామని ఎస్‌ఐ చెప్పారు.
కాలువలోకి దూకిన యువకుడు
Comments
Please login to add a commentAdd a comment