ఏలూరులో 5న వైఎస్సార్‌సీపీ ఫీజు పోరు
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు
ఏలూరు టౌన్: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 5న ఏలూరులో వైఎస్సార్‌సీపీ ఫీజు పోరు కార్యక్రమం నిర్వహించనున్నట్టు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు తెలిపారు. ఏలూరులోని పార్టీ కార్యాలయంలో ఫీజు పోరు పోస్టర్లను శనివారం ఆయన ఆవిష్కరించారు. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్ నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తామన్నారు. ఫీజు పోరుకు జిల్లాలోని విద్యార్థులు, తల్లిదండ్రులు, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పేద పిల్లలపై కక్ష సాధింపు చర్యలేంటి సీఎం చంద్రబాబూ అంటూ నిలదీశారు. మూడు త్రైమాసికాలుగా ఫీజు బకాయిలు విడుదల చేయ కుండా రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించా రు. ఫీజుల కోసం విద్యార్థులను కళాశాలల యాజమాన్యాలు వెళ్లగొడుతున్నాయని, దిక్కుతోచని స్థితిలో చదువులు మాని కూలి పనులకు వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత వైఎస్సార్ పేద పిల్లల ఉన్నత చదువులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రారంభిస్తే.. 2014–19 కాలంలోనూ చంద్రబాబు ఈ పథకానికి తిలోదకాలు ఇచ్చారన్నారు. 2019లో అధికారం చేపట్టిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని, గత విద్యాసంవత్సరంలో డిసెంబర్ త్రైమాసికం వరకు రూ. 12,609 కోట్లు ఒక్క విద్యాదీవెన పథకానికే ఖర్చు చేశారన్నారు. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలకు రూ.18 వేల కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. కూటమి సర్కారులో ఫీజు పథకానికి రూ. 2,800 కోట్లు, మరో రూ.1,100 కోట్లు వసతి దీవెన బకాయిలు పెండింగ్ పెట్టారని విమర్శించారు.
విద్యారంగాన్ని నాశనం చేస్తున్నారు
ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ పేద పిల్లలు ఉన్నత చదువులు చదవటం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదని, విద్యారంగాన్ని సమూలంగా నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారని విమర్శించారు. చింతలపూడి స మన్వయకర్త కంభం విజయరాజు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, కూటమి నే తలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలపై కోపంతో ఉన్నారని, వారి పిల్లల భవిష్యత్తును దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ మేయర్ నూకపెయ్యి సుధీర్‌బాబు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, వైఎస్సార్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు పల్లి శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్ గురునాథ్, దివ్యాంగుల విభా గం జిల్లా అధ్యక్షుడు షేక్ షమీం, జిల్లా కార్యదర్శి జనార్దన్, బీసీ సెల్ నగర అధ్యక్షుడు కిలాడి దుర్గారావు, నగర విద్యార్థి విభాగం అధ్యక్షుడు బాలాజీ, కార్పొరేటర్లు గరికిముక్కు జయకర్, గ్జేవియర్ మాస్టర్, మైనార్టీ నేత షేక్ రియాజ్ ఆలీఖాన్, ఎస్సీ నాయకులు బండ్లమూడి సునీల్‌కుమార్, తులసీ వర్మ, జంగం నారాయణ, సొంగ మధు పాల్గొన్నారు.
ఎస్పీకి వినతి
వైఎస్సార్‌సీపీ ఫీజు పోరు కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్‌కు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ వినతిపత్రం సమర్పించారు. ఏలూరులోని ఎస్పీ కార్యాలయంలో ఆయన్ను కలిశారు. ఈనెల 5న ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ, అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తామని స్పష్టం చేశారు.
ఎస్పీకి వినతి
వైఎస్సార్‌సీపీ ఫీజు పోరు కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్‌కు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ వినతిపత్రం సమర్పించారు. ఎస్సీ కార్యాలయంలో ఆయన్ను కలిశారు. 5న ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ, అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తామని స్పష్టం చేశారు.
ప్రజల పక్షాన పోరాటం చేద్దాం
ఏలూరు టౌన్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటూ ప్రజాపక్షాన పోరాటం చేయటమే ప్రధాన లక్ష్యమని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్‌తోపాటు పార్టీ నాయకులు ఆయ న్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. జిల్లాలో రాజకీయ పరిస్థితులు, కూట మి ప్రభుత్వ హయాంలో పరిణామాలను సజ్జలకు వివరించారు. ఈనెల 5న చేపట్టే ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చేపట్టిన చర్యలను తెలియజేశారు.
ఏలూరులో 5న వైఎస్సార్‌సీపీ ఫీజు పోరు
Comments
Please login to add a commentAdd a comment