మూత్ర విసర్జనకు వెళ్లి.. కుప్పకూలి
పెదవేగి : నిద్రలో లేచి మూత్ర విసర్జన చేస్తున్న యువకుడు ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందాడు. ఎస్సై కె రామకృష్ణ తెలిపిన వివరాలివి. బి సింగవరం గ్రామానికి చెందిన పొలగాని ఉదయ్ కుమార్ (23)కు తేజశ్రీతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. ఉదయ్‌కుమార్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 24న రాత్రి 8 గంటల సమయంలో ఇంటి నుంచి డ్యూటీ కి వెళుతున్నానని భార్యకు చెప్పి, రాయన్నపాలెంలో ఉన్న అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. అక్కడ నిద్రిస్తుండగా మధ్యలో మూత్ర విసర్జనకు వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. అతడిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
వ్యక్తి ఆత్యహత్య
భీమవరం: ఉరి వేసుకుని ఒక వ్యక్తి మృతి చెందాడు. భీమవరం చినఅప్పారావుతోటకు చెందిన పులపర్తి బాలాజీ(37)కి మొగల్తూరు మండలం నీటితిప్పకు చెందిన ప్రసన్నతో ఏడేళ్ల కిందట వివాహమైంది. బాలాజీ ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తూ భీమవరంలో ఉంటున్నారు. ఇటీవల బెట్టింగుల్లో ఆర్థికంగా నష్టపోగా అప్పులను కుటుంబ సభ్యులు తీర్చారు. సోమవారం రాత్రి వేరే గదిలో ఒంటరిగా నిద్రించిన బాలాజీ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి సూర్యనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment