అగ్గిపుల్లపై శివుని రూపం
ఏలూరు (టూటౌన్): అగ్గిపుల్లపై శివుని చిత్రాన్ని రూపొందించి అబ్బుర పరుస్తున్నారు సూక్ష్మ కళాకారుడు మేతర సురేష్ బాబు. పండుగలు, జాతీయ పండుగ దినాల సందర్భంగా సందర్భోచితంగా స్పందించే సురేష్ బాబు తాజాగా శివరాత్రి సందర్భంగా అగ్గిపుల్లపై శివుని చిత్రాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా సూక్ష్మ కళాకారుడు సురేష్ బాబును పలువురు అభినందిస్తున్నారు.
వ్యభిచారం కేసులో
వ్యక్తికి మూడేళ్ల జైలు
కొయ్యలగూడెం: వ్యభిచారం కేసులో వ్యక్తికి కోర్టు జైలు శిక్ష విధించినట్లు ఎస్సై వి.చంద్రశేఖర్ మంగళవారం పేర్కొన్నారు. వివరాల ప్రకారం 2018 సంవత్సరంలో చిటికెన శ్రీను అనే వ్యక్తి పొంగుటూరులోని తన నివాసంలో వ్యభిచారం నిర్వహిస్తుండగా అప్పటి సీఐ కె.బాలరాజు దాడి జరిపి నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అప్పటినుంచి కేసు విచారణలో ఉండగా మంగళవారం కొవ్వూరు అసిస్టెంట్ సెషన్స్ కోర్టు నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ఎస్సై చెప్పారు.
అక్రమ కలప స్వాధీనం
కొయ్యలగూడెం: మూడు లారీల్లో అక్రమంగా తరలిస్తున్న కలపను స్వాధీనం చేసుకున్నట్లు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బి.దినేష్ తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున తూర్పుగోదావరి జిల్లా నుంచి దిప్పకాయలపాడు లారీల్లో బేరన్ క్యూరింగ్ నిర్వహణ కోసం తరలిస్తున్న కలపను గుర్తించామన్నారు. దీంతో సిబ్బందితో కలిసి కొయ్యలగూడెం సమీపంలో కలప లారీలను స్వాధీనం చేసుకుని కన్నాపురం రేంజ్ కార్యాలయానికి తరలించి సీజ్ చేసినట్లు చెప్పారు. ఈ కలప విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని తెలిపారు.
అగ్గిపుల్లపై శివుని రూపం
Comments
Please login to add a commentAdd a comment