సాక్షి హైదరాబాద్ : చిన్న సినిమాగా విడుదలైన ‘జాతి రత్నాలు’ చిత్రం ప్రతీ చోట పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఊహించని స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. వినోదమే ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు రాష్ల్రాలతో పాటు ఓవర్‌సీస్‌లోనూ సత్తా చాటుతోంది. ఇక యూఎస్‌లో అయితే ఈ మధ్య కాలంలో ఏ చిత్రం నమోదు చేయని రికార్డులను నమోదు చేస్తోంది. మొదటి వారం పూర్తి కాక ముందే అర మిలియన్ డాలర్ల మార్క్‌ను సాధించి, మిలియన్ రేసులోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ చిత్రం అక్కడి పంపిణీదారులకు కాసుల పంట కురిపిస్తోంది.
చిన్న సినిమా ...పెద్ద విజయం
డైరక్టర్ అనుదీప్ కేవి సినిమా అంతటా ఒకే వేగాన్ని కొనసాగిస్తూ, వినోద అంశంపై ఏ మాత్రం రాజీపడకుండా , కథకు సమాన ప్రాధాన్యతను ఇచ్చాడనే చెప్పాలి. ముఖ్యంగా, సెకండ్ హాఫ్‌లోని కొన్ని సన్నివేశాలు బాగా వచ్చాయి. స్వప్నా సినిమా బ్యానర్‌లో నాగ్ అశ్విన్ నిర్మించిన నిర్మాణ విలువలు ఎక్కడా కూడా ఇది చిన్న సినిమా అనే ఆలోచనను రానివ్వలేదు. రాధన్ సంగీతం ఈ చిత్రానికి వెన్నెముకగా నిలిచింది. కరోనా కారణంగా జనాలు లేని థియేటర్లకు హౌస్ పుల్‌బోర్డులు పెట్టించిన ఘనత ‘ జాతి రత్నాల’కే దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment