గ్రహణ భయం ఎంత పనిచేసింది..మొత్తం కుటుంబమే..! | Astrology Influencer Upset Over Eclipse Stabs Partner Throw Kids Moving Car | Sakshi
Sakshi News home page

గ్రహణ భయం ఎంత పనిచేసింది..మొత్తం కుటుంబమే..!

Published Thu, Apr 11 2024 11:39 AM | Last Updated on Thu, Apr 11 2024 12:31 PM

Astrology Influencer Upset Over Eclipse Stabs Partner Throw Kids Moving Car - Sakshi

ఓ జ్యోతిష్యురాలు ఆన్‌లైన్‌లో వ్యక్తుల జాతకాలు చె​బుతూ ఫేమస్‌ అయ్యింది. ఏమయ్యిందో ఏమో..! దేనికైన పరిష్కారాలు చెప్పి ప్రజల సమస్యల నుంచి బయటపడేలా చేసే ఆమె గ్రహణానికి కలవరపడింది. ఏం జరుగుతుందనుకుని ఇంతటి అఘాయిత్యానికి తెరతీసిందో తెలియదు. కానీ ఓ కుటుంబం మొత్తం బలైపోయింది. ముఖ్యంగా ముక్కుపచ్చలారిని చిన్నారుల జీవితాలను కల్లోల పరిచింది ఆ తల్లి. ఈ షాకింగ్‌ ఘటన ఎక్కడ జరిగిందంటే..

యూఎస్‌కి చెందిన ప్రముఖ​ జ్యోతిష్యురాలు డేనియల్‌ జాన్సన్‌. ఆమె ఆన్‌లైన్‌లో ఆధ్యాత్మిక సందేశాలివ్వడం, జ్యోతిష్యం వంటివి చెబుతూ మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవల అమెరికాలో సూర్యగ్రహణం ఏర్పడిన సంగతి తెలిసిందే. జ్యోతిష్యంలో ఇంత అనుభవజ్ఞురాలైన డేనియల్‌ ఈ సూర్యగ్రహణానికి ఎందుకింత కలవరపాటుకి గురయ్యిందో తెలియదు. అంతే ఉన్నట్టుండి ఆన్‌లైన్‌ వేదికగా ఈసారి అమెరికాలో వచ్చే సూర్యగ్రహణం చాలా శక్తిమంతమైనదని చెబుతూ..ఇప్పుడే మేల్కోండి గ్రహణం ఏర్పడబోతుంది, కొత్త ప్రపంచం రానుంది ఏం చేయాలన్ని ఇది సరైన సమయం అని పోస్ట్‌ పెట్టింది.

ఆ తర్వాత కొద్ది క్షణాలకే తన భాగస్వామిని హతమార్చి తన ఇద్దరు కుమార్తెలను తీసుకుని కారులో వేగంగా వెళ్లిపోయింది. అక్కడితో ఆగకుండా ముక్కుపచ్చలారిని చిన్ని పిల్లలని చూడకుండా కదలుతున్న కారు గురండా విసిరేసింది. ఈ ఘటనలో తొమ్మిదేళ్ల చిన్నారి ప్రాణాలతో బయటపడగా, ఎనమిదినెలల చిన్నారి మృత్యువాత పడింది. ఇక ఆమె కారు జస్ట్‌ 30 నిమిషాల్లోనే చెట్టుకు ఢీ కొని క్రాష్‌ అయ్యింది. ఆమె కూడా క్షణాల వ్యవధిలో చనిపోయింది. ఈ ప్రమాదంలో డేనియల్ శరీరం గుర్తు పట్టలేనివిధంగా చిధ్రమయ్యింది.

ఈ విషయం తెలుసుకున్న అమెరికా పోలీసులు డెనియల్‌ని గుర్తించడాని చాలా వ్యవధి తీసుకున్నారు. అంతేగాదు విచారణలో జాన్సన్‌, అయోకా ఇద్దరూ ఒకే వ్యక్తి అని తేల్చారు. ఇక్కడ పోలీసులు డేనియల్‌ జాన్సన్‌ని ఆన్‌లైన్‌లో డేనియల్‌ అయోకాగా పిలుస్తారని, ఆమె ప్రముఖ జ్యోతిష్యురాలని గుర్తించడం జరిగింది. గ్రహణాల కారణంగా ప్రపంచంలో విపత్తులు జరుగుతాయని జ్యోతిష్యులు, ఆధ్యాత్మిక వేత్తలు చెప్పినప్పటికీ, అదే జరుగుతుందనేందుకు వాస్తవిక ఆధారాలు లేవు.

ఇక అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో పాక్షిక గ్రహణ ఏర్పడింది. అయినా డేనియల్‌ భయాందళనల నేపథ్యంలో తీసుకున్న ఈ దురాగత చర్య మొత్తం కుటుంబమే తుడిచిపెట్టుకుపోయింది. ఎవ్వరైనా ఇలాంటి అపోహాలు భయాలు వెంటాడితే పెద్దవాళ్లనో లేక అనుభవజ్ఞుల సలహాలు సూచనలు తీసుకోండి. తొందరపడి అనుచిత నిర్ణయాలతో మిమ్మల్ని, కుటుంబ సభ్యల్ని అగాథంలోకి నెట్టిపనులకు పూనుకోకండి. 

(చదవండి: సిబ్లింగ్స్‌ డే: సెలబ్రెటీ సిబ్లింగ్స్‌..ఆ బంధం ఏం చెబుతోందంటే..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement