చిట్టీ.. ద రోబో గుర్తుంది కదా! అలాంటి రోబోలు నిజ్జంగా వచ్చే రోజులు దగ్గరకు వచ్చేస్తున్నాయి. యజమాని మాటను బట్టి చూపును బట్టి ఆజ్ఞలు స్వీకరించే రోబోలు ఇప్పటికే వచ్చేశాయి. ఇకపై నీడను బట్టి యజమానిని గుర్తుపట్టి ఆజ్ఞలు స్వీకరించే రోబోలు రాబోతున్నాయి. తాజాగా రోబోలు తమ యజమానిని గుర్తుపట్టేందుకు నీడలను విశ్లేషించుకునే అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీని కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకులు కనిపెట్టారు. జీవుల్లో ప్రాథమిక సమాచార మార్పిడి స్పర్శ ద్వారానే జరిగేది. అనంతరం జీవ పరిణామంలో శబ్దాలు, భాషలు, రాతలు వచ్చాయి.
అయితే రోబోల విషయంలో స్పర్శ ద్వారా యజమానిని గుర్తించేలా చేయడం ఖరీదైన ప్రక్రియ. ఇందుకు రోబో శరీరమంతా సెన్సర్లు అమర్చాల్సి ఉంటుంది. ఈ ఇబ్బందిని తొలగించే క్రమంలో తాజా పరిశోధన ఉపయోగపడనుంది. ఈ షాడో సెన్స్ సిస్టమ్‌లో యూఎస్‌బీ కెమెరాతో నీడలను రోబోలు గ్రహించుకుంటాయి. అనంతరం ఆల్గారిధమ్స్‌తో నీడను విశ్లేషించుకుంటాయి. పూర్తిస్థాయిలో ఈ ప్రయోగాలు ఫలిస్తే,సెన్సార్ స్టిసమ్ లో విప్లవాత్మక మార్పులు వస్తాయని పరిశోధన నాయకుడు గైహాఫ్‌మన్ చెప్పారు. ప్రస్తుత పరిశోధనలో 96 శాతం వరకు కచ్ఛితత్వంతో కూడిన ఫలితాలు వచ్చాయన్నారు. దీనివల్ల భవిష్యత్‌లో రోబో రూపకల్పన మరిన్ని కొత్తపుంతలు తొక్కనుంది.
Comments
Please login to add a commentAdd a comment