ప్రతీకాత్మక చిత్రం
Gynaecology Counselling: నాకు 40 సంవత్సరాలు. అయిదేళ్లుగా హెవీ పీరియడ్స్ అవుతున్నాయి. చాలా మందులు వాడాను. యుటెరస్‌లో ఏ ప్రాబ్లమ్ లేదని చెప్పారు. ఈ మధ్యే ఒక సీనియర్ డాక్టర్ Mirena Coil సజెస్ట్ చేశారు.
ఇది సురక్షితమైనదేనా? వేయించుకోవచ్చా? గర్భసంచి తీయించుకోవడమొక్కటే బెస్ట్ ట్రీట్‌మెంట్ అని కొంతమంది చెప్పారు. నా సమస్యను అర్థం చేసుకొని సలహా ఇవ్వగలరు. – కె. నీలిమ, మిర్యాలగూడ
Mirena అనేది లూప్ లాంటిది. ఈ మధ్య చాలామందికి వేస్తున్నాం. హెవీ పీరియడ్స్‌కి బాగా పనిచేస్తుంది. ఇది కాపర్‌టీ డివైస్ లాంటిది. కాకపోతే దీనిలో ప్రొజెస్టిరాన్ హార్మోన్ పూత ఉంటుంది. అది రోజూ కొంచెం కొంచెంగా హార్మోన్‌ను విడుదల చేసి గర్భసంచి పొరను పల్చగా ఉంచుతుంది. దీంతో అధిక రక్తస్రావం తగ్గుతుంది. ఈ Mirena వేసిన 3–6 నెలల తర్వాత నెలసరి పెయిన్, రక్తస్రావం చాలా వరకు తగ్గుతాయి.
దీన్ని గర్భసంచిలో అమర్చిన తర్వాత అయిదేళ్ల వరకు పనిచేస్తుంది. ఇది మీకు సరిపడుతుంతో లేదో అనేది వెజైనల్ ఎగ్జామినేషన్ ద్వారా నిర్ధారిస్తారు. ఇన్‌ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తారు. అయిదేళ్ల తర్వాత తీసేసి.. మళ్లీ కొత్తది వేస్తారు.
మామూలు గైనిక్ అవుట్ పేషంట్ వార్డ్‌లోనే ఈ ప్రొసీజర్ చేస్తారు. దీనికి మత్తు అవసరం లేదు. అల్ట్రాసౌండ్‌లో గర్భసంచి ఎలా ఉందో చెక్ చేసి.. నెలసరి అయిపోయిన మొదటివారంలో వేస్తారు. దీనితో ఇంకో ఉపయోగం కూడా ఉంది. ఇది కాంట్రాసెప్టివ్‌లా కూడా పనిచేస్తుంది.
ఇంటర్‌కోర్స్‌లో ఏ ఇబ్బందీ కలిగించదు. హార్మోన్స్ లోపం వల్ల హెవీ పీరియడ్స్ అవుతుంటే ఈ Mirena చాలా బాగా పనిచేస్తుంది. 35 – 45 ఏళ్ల మధ్య వయస్సు వారికి ఇది మంచి ఆప్షన్. గర్భసంచి తీసేయడాన్ని నివారించొచ్చు. హిస్టెరెక్టమీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌ను, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్‌ను ఈ Mirena మూలంగా తప్పించవచ్చు.
-డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
చదవండి: Pregnancy Tips: ఆరో నెల.. నడుము నొప్పి, కాళ్ల నొప్పులు.. ఎలాంటి పెయిన్ కిల్లర్స్ వాడాలి?
Comments
Please login to add a commentAdd a comment