పేను కొరుకుడు సవుస్యను వైద్య పరిభాషలో అలోపేషియా ఏరియేటా అంటారు. ఈ సమస్య ఉన్నవారిలో జుట్టు గుండ్రగా ప్యాచెస్ ప్యాచెస్ గా రాలిపోతూ ఉంటుంది. అంటే జుట్టు రాలిపోయిన చోట... అది గుండ్రంగా ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. ఒక్కోసారి రాలిన చోట జుట్టు దానంతట అదే వస్తుంది కూడా. ఈ జుట్టురాలిన ప్యాచెస్ ఎన్ని ఉన్నాయనే దానిపైనే చికిత్స ఆధారపడి ఉంటుంది. అంటే... ప్యాచెస్ పరివూణం, సంఖ్య తక్కువైతే కేవలం పూతవుందులు (టాపికల్ ట్రీట్‌మెంట్) సరిపోతాయి. దానికితోడు వెంట్రుకలు రాలిపోయిన ఆ ప్యాచెస్‌లో ఒక్కోసారి ఇంట్రా లీజనల్ స్టెరాయిడ్స్ అనే ఇంజెక్షన్స్ కూడా ఇవ్వాల్సిరావచ్చు.
అదే ప్యాచెస్ సంఖ్య ఎక్కువైతే నోటి ద్వారా కూడా వుందులు (ఓరల్ మెడికేషన్) తీసుకోవాల్సి ఉంటుంది. అలొపేషియా ఏరియేటా సవుస్య ఉంటే చికిత్స తప్పక తీసుకోవాలి. లేకపోతే ఒక్కోసారి జుట్టుమెుత్తం రాలిపోయే ప్రవూదం ఉంది. దీన్నే వైద్య పరిభాషలో అలొపేషియా టోటాలిస్ అంటారు. ఆ పరిస్థితి రాకముందే చికిత్స తీసుకోవడం మంచిది.
Comments
Please login to add a commentAdd a comment