రంగులలో చిత్రమై సిల్వర్‌లో సింగారమై దారాలతో జత కట్టి బంగారంగా మెరిసిపోయే కృష్ణ సౌందర్యాన్ని ఎన్ని వర్ణాల రూపు కట్టినా తనివి తీరదు. ఎన్ని విధాల వివరించినా మాటలు చాలవు. అందుకే ఆభరణాల డిజైన్‌లలో ప్రేమాన్వితమై వేల కాంతులను వెదజల్లుతున్నాడు.
టెంపుల్ జ్యువెలరీ
దేవతామూర్తుల ఆభరణాలలో రాధాకృష్ణుల రూపుతో ఉండే నెక్లెస్‌లు, హారాలు చూడగానే ముచ్చటగొలుపుతుంటాయి. నెమలి పింఛాల అందం, మురళీలోలుడుగా దర్శనమిచ్చే డిజైన్లు అన్నింటికన్నా ముందుంటాయి. అందుకు గోపికావల్లభుడిలో ఉండే ఆకర్షణ అసలైన కారణం.
దారాల జతలు.. మట్టి కోటలు
రంగు రంగుల దారాలను ముడులు వేస్తూ, కృష్ణుడి పెండెంట్‌ను దానికి జత చేస్తే ఆ సింగారాన్ని చూడటానికి రెండు కళ్లూ సరిపోవనిపిస్తుంది. వీటికే కొన్ని గవ్వలు, కొన్ని మువ్వలు జత చేస్తే ఫ్యాషన్ జ్యువెల్రీ అదుర్స్ అనిపించకమానదు. టెర్రకోట జ్యువెలరీలో కృష్ణుడు పెట్టని కోటలా హుందాగా మెరిసిపోతాడు.
పెయింటింగ్ చిత్రాలు
కృష్ణుడు ఉంటే రాధను వేరుగా చూపలేరు చిత్రకారులు. ఆ అందాన్ని ఫ్యాబ్రిక్, ఉడెన్.. మీద పెయింటింగ్‌గా కన్నయ్యను చిత్రించి, దండలలో కూర్చితే వెస్ట్రన్–ట్రెడిషన్ రెండు వేషధారణల్లోనూ సూపర్బ్ అనిపిస్తాడు.
చిహ్నాలూ సుందరమే
కృష్ణుడు రూపుతోనే ఆభరణాలను ధరించాలనేమీ లేదు. ఆ కిరీటి ధరించే నెమలి పింఛం, మురళీ, గోవు .. చిహ్నాలు కూడా ఆభరణమై మగువుల మదిని దోచుకుంటున్నాయి. వీటితో ఎన్నో సృజనాత్మక ఆభరణాలు రూపుకడుతున్నాయి.
సిల్వర్ సింగారం
వెండి ఆభరణాలలో కృష్ణుడి రూపుతో డిజైన్ ఉంటే సంప్రదాయ వస్త్రాలకంరణే కాదు, పాశ్చాత్య దుస్తుల మీదకూ అందంగా నప్పుతాయి.
చదవండి: Protein Laddu- Aval Puttu: కన్నయ్యకు ఇష్టమైన వెన్న, అటుకులతో ప్రొటిన్ లడ్డు, అవల్ పుట్టు!
Sri Krishna Janmastami: కన్నయ్య వేడుకకు ఇస్కాన్ మందిరం ముస్తాబు
Srikrishna Janmashtami 2022: శ్రీకృష్ణ చెలిమి.. శ్రీనివాస కలిమి
Comments
Please login to add a commentAdd a comment