ఇంటిపనులతో ఎప్పుడూ బిజీగా ఉండే గృహిణులు కాస్త సమయం దొరికితే... నచ్చిన వ్యాపకాలతో కాలక్షేపం చేస్తుంటారు. షిజే వర్గీస్ అలాగే తనకు నచ్చిన çపుట్టగొడుగుల సాగును చేపట్టి ఖాళీసమయాన్ని కాసుల పంటగా మార్చి, నెలకు లక్షరూపాయలకు పైగా ఆర్జిçస్తున్నారు. మరోపక్క తనలాంటి వారెందరికో పుట్టగొడుగు ల పెంపకం గురించి క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇది గుర్తించిన కేరళ ప్రభుత్వం ‘బెస్ట్ మష్రుమ్ ఫార్మర్’ అవార్డుతో సత్కరించింది.
కేరళలోని అలప్పుఱ జిల్లా ఎరమళ్లూ్లర్‌కు చెందిన షిజే వర్గీస్ ఇంటిపనులు, పిల్లల బాగోగులు చూసుకుంటూ బిజీగా ఉండేవారు. పిల్లలు ఎదిగి తమ పనులు తాము చేసుకుంటుండడంతో షిజేకు కాస్త తీరిక దొరికింది. అప్పుడే అనుకోకుండా షిజే ఇంటికి దగ్గర్లో ‘‘పుట్టగొడుగుల పెంపకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిçస్తున్నాం. మీరు పాల్గొనండి’’ అని వ్యవసాయ అధికారి షిజేను ఆహ్వానించారు. అక్కడ పుట్టగొడుగుల పెంపకం గురించి తెలుసుకుంది. అది నచ్చడంతో ఇంట్లోనే పుట్టగొడుగుల సాగును ప్రారంభించింది.
రెండు ప్యాకెట్లు, ఆరు బెడ్లు..
2007లో రెండు ప్యాకెట్ల విత్తనాలు, ఆరు బెడ్లతో పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రారంభించింది. కానీ పుట్టగొడుగులు పెద్దగా పెరగలేదు. అయితే షిజే భర్త ఆమెను ప్రోత్సహించడంతో ఈ సారి 300 బెడ్లతో పెంపకాన్ని చేపట్టింది. ఈ క్రమంలో కేరళలో పుట్టగొడుగులు సాగుచేస్తోన్న అనేక ప్రాంతాలను సందర్శించి దానిలో మరిన్ని మెలకువలు నేర్చుకుని వాటిని తన సొంత క్షేత్రం లో అమలు చేయడంతో విజయం సాధించింది.
కూన్ ఫ్రెష్..
షిజే పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించిన రెండేళ్లల్లో పోషకాలతో కూడిన ‘ఆయిస్టర్, మిల్కీ పుట్టగొడుగులను’ సాగు చేసి వాటిని ‘కూన్‌ఫ్రెష్’పేరిట విక్రయించేవారు. మలయాళంలో కూన్ అంటే పుట్టగొడుగులు అని అర్థం. కూన్‌ఫ్రెష్ మష్రుమ్స్ రుచికరంగా ఉండడంతో ఎక్కువమంది కొనుగోలు చేసేవారు. కూన్‌ఫ్రెష్‌కు మంచి డిమాండ్ పెరగడంతో ఉత్పత్తిని పెంచారు. ప్రస్తుతం రెండు వేల బెడ్లు రోజుకు ఎనిమిది నుంచి పది కేజీల వరకు పంటను ఉత్పత్తి చేస్తున్నారు. వీటికి మంచి ధర పలకడం తో నెలకు లక్ష రూపాయలకు పైగా ఆదాయం వస్తోంది. ఈ విషయం వ్యవసాయ శాఖాధికారులకు తెలియడంతో వారు ఆమె ఇంటికి వచ్చి పుట్టగొడుగుల సాగును పరిశీలించి, మరింత మందికి ఆమెతో క్లాసులు చెప్పించేవారు. దీంతో షిజే వారికి టీచర్‌గా మారి పుట్టగొడుగుల పెంపకం గురించి బోధించడం ఆరంభించారు.
సొంతంగా విత్తనాల తయారీ..
తొలినాళ్లల్లో వేరే రైతుల వద్ద విత్తనాలు, క్రిమిసంహారాలు గురించి తెలుసుకుని వాడేవారు. షిజేకు పుట్టగొడుగుల సాగుపై అనుభవం పెరిగేటప్పటికీ స్వయంగా విత్తనాలు తయారు చేసుకుంటున్నారు. ప్రారంభంలో కోచ్చిలోని సూపర్ మార్కెట్లలో పుట్టగొడుగులను విక్రయించేవారు. తరువాత ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. గత ఎనిమిదేళ్లుగా కేరళ వ్యాప్తంగా పుట్టగొడుగుల సాగుపై షిజే వీక్లీ క్లాసులు నిర్వహిస్తున్నారు. గతేడాది కరోనా లాక్‌డౌన్‌తో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తూ కొత్తగా వచ్చేవారికి సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఈ మొత్తం పనిలో షిజేకి భర్తతోపాటు కొడుకు, కూతురు సాయం చేస్తున్నారు.
ఎవరైనా చేయవచ్చు..
‘‘ప్రారంభంలో నాకు ఇష్టలేకపోయినప్పటికీ మావారి ప్రోత్సాహంతో ఈరోజు ఈస్థాయికి ఎదిగాను. పోషకాలతో కూడిన పుట్టగొడుగులు ఉత్పత్తి చేయడం వల్ల మా కూన్‌ఫ్రెష్‌కు మంచి డిమాండ్ వచ్చింది. పుట్టగొడుగుల సాగు ఎవరైనా చేయవచ్చు. నిబ్బద్దత, ఆసక్తి, సహనంతో చేయగలిగితే మంచి లాభాలు ఆర్జించవచ్చు’’ అని షిజే చెప్పారు.
కాలక్షేపంలో కాసుల పుట్ట
Published Sat, Jun 19 2021 5:04 AM | Last Updated on Sat, Jun 19 2021 5:04 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment