రూ.13 కోట్ల వార్షిక ఆదాయంతో మొదటి స్థానం
తెలంగాణలోని దేవాలయాల్లో ఏడో స్థానం
ఏయేటికాయేడు పెరుగుతున్న భక్తుల సంఖ్య..
బంజారాహిల్స్: జంట నగరాల్లోనే జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి అటు భక్తుల రాకతోనూ, ఇటు ఆదాయంలోనూ ‘పెద్దమ్మ’గా దినదిన ప్రవర్ధమానమై వర్ధిల్లుతోంది. భక్తుల కోర్కెలు నెరవేర్చడంలోనే కాకుండా హుండీ ఆదాయంలోనూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నెంబర్–1 స్థానంలో కొనసాగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా చూస్తే అటు భక్త జనసందోహంలోనూ, ఇటు ఆదాయ ఆర్జనలోనూ పెద్దమ్మ గుడి ఏడో స్థానంలో నిలిచింది. యేటా ఆదాయం పెరుగుతూ భక్తులను మరింతగా ఆకర్షిస్తూ ఈ ఆలయం వెలుగొందుతోంది. పెద్దమ్మ గుడి వార్షిక నికర ఆదాయం రూ.13 కోట్లు ఉండగా ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపేణా రూ.25 కోట్లు ఉన్నాయి. అమ్మవారికి 15 కిలోల బంగారు వజ్రాభరణాలు ధగధగలాడుతూ భక్తుల కొంగుబంగారం అమ్మవారు కీర్తిప్రతిష్టలను మూటగట్టుకుంటున్నది.
ప్రసాద విక్రయాలు, ఆదాయంలో..
హుండీ ఆదాయం ప్రతినెలా రూ.50 నుంచి రూ.60 లక్షల వరకూ వస్తుంది. ప్రసాద విక్రయాల్లోనూ ఈ ఆలయం నెంబర్–1 స్థానంలో ఉంటుంది. రోజుకు 8 క్వింటాళ్ల పులిహోర అమ్ముతుండగా, 12 వేల లడ్డూలు విక్రయిస్తున్నారు. వారంలో మంగళ, శుక్ర, శని వారాల్లో మూడు సార్లు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. యేటా మూడు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. వార్షిక రథోత్స
వం, శాకాంబరి ఉత్సవాలు, దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు.. ఈ మూడు పండుగలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఒక్క ఆదివారం రోజే 40 వేల మంది దాకా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారికి మొక్కలు చెల్లించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment