ఢిల్లీ ఫ్రాంఛైజీతో ఉన్న సుదీర్ఘ అనుబంధానికి వీడ్కోలు పలకనున్నాడు స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్. లక్నో సూపర్ జెయింట్స్ పంత్‌ను ఏకంగా రూ. 27 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అందువల్ల వచ్చే ఏడాది పంత్ లక్నోకు ఆడబోతున్నాడు. రిషబ్ పంత్‌కు వందకు పైగా ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఆడిన అనుభవం ఉంది. పైగా వేలాది పరుగులు కూడా సాధించాడు. ఇక యాక్సిడెంట్ తర్వాత కూడా అందే దూకుడుతో మైదానంలో విధ్వసం సృష్టించాడు. అలాగే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన స్టార్ వికెట్ కీపర్ అండ్ బ్యాటర్‌గా పంత్ నిలిచారు. అలాంటి అద్భుత ఆటగాడి డైట్ ప్లాన్ గురించి తెలుసుకుందామా..!
ఈ భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ టీ20 ప్రపంచకప్ జట్టుకు సిద్ధమవుతున్న సమయంలో కేవలం నాలుగు నెలల్లో 16 కిలోలు బరువు తగ్గాడు. ఇంతలా బరువుని అదుపులో ఉంచుకునేందుకు ఆయన ఫాలో అయ్యే సింపుల్ డైట్ టిప్స్ ఏంటో చూద్దామా..!.
కేలరీలు తక్కువగా ఉన్న ఆహారానికే ప్రాధాన్యత ఇచ్చేవాడు. దీనివల్ల అతని శరీరం శక్తి కోసం నిల్వ ఉన్న కొవ్వును ఉపయోగిస్తుంది. తద్వారా బరువు నియంత్రణలో ఉంచుకునే అవకాశం ఉంటుంది.
అలాగే ఇంట్లో వండిన బోజనానికే ప్రాధాన్యత. బయట ఫుడ్ జోలికి వెళ్లడు. ముఖ్యంగా రెస్టారెంట్ లేదా హోటల్ ఫుడ్స్ వైపుకి వెళ్లడు.
దీనివల్ల ఇంట్లో వండే పద్ధతుల రీత్యా మంచి ఆరోగ్యం సొంతం చేసుకోవడమే గాక అనారోగ్య సమస్యల బారిన పడకుండా సురక్షితంగా ఉంచుతుంది.
ఆయిల్ పరిమితంగా ఉన్న ఆహారమే ఎంపిక చేసుకుంటాడు పంత్
అలాగే రాస్‌మలై వంటి స్వీట్లు, బిర్యానీ, ఫ్రైడ్ చికెన్ వంటి అధిక క్యాలరీల ఆహారానికి పూర్తిగా దూరం. బరువు అదుపులో ఉండేలా వేయించిన పదార్థాలు, చక్కెర సంబంధిత పదార్థాలను తీసుకోరట పంత్.
తగిన సమయానికి నిద్ర పోవడం కూడా తన బరువుని అదుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తోందని తెలుస్తోంది
గోవాన్ భిండి(ఓక్రా) పట్ల తనకున్న మక్కువ, మసాల దినుసుల తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఇలా పంత్‌లా ఆగ్యకరమైన డైట్‌కి ప్రాధాన్యత ఇస్తే బరువు తగ్గడం అత్యంత ఈజీ. అందుకు కాస్త శ్రద్ధ, నిబద్ధత అవసరం అంతే..!.
(చదవండి: ఆర్‌బీఐ గవర్నర్‌కి ఛాతినొప్పి: ఎసిడిటీ వల్ల కూడా ఇలా జరుగుతుందా?)
Comments
Please login to add a commentAdd a comment