'చీర' అంటే అందం, ఆనందం. అలాంటి 'చీర' కేవలం సౌందర్యాన్ని పెంచే ఓ వస్త్రమే కాదు...భారతీయ సంస్కృతికి చిహ్నం కూడా. అందుకే అతివల దుస్తుల వరుసలో చీర ఎప్పుడూ ముందుంటుంది. ‘నువ్వు పట్టు చీర కడితే ఓ పుత్తడి బొమ్మా...ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ’ అన్నాడో కవి. పట్టు చీరే కాదు...పట్టుమని వంద రూపాయలు చేయని చీరలో కూడా మగువ అందం మూడింతలవుతుంది.
దక్షిణాది కంజీవరం నుంచి బెంగాల్ వారి బలుచరి వరకు... సెలెబ్రిటీలు కట్టే ఫ్యాన్సీ చీరల నుంచి పల్లె పడుచులు కట్టే నేత చీర వరకూ...చీర చీరకూ అందమే.కట్టిన ప్రతి పడతిలోనూ సౌందర్యమే. అందుకే కాబోలు సినీతారలు సైతం చీరను చిన్నచూపు చూడరు. అలాంటి గొప్ప ప్రత్యేకతను దక్కించుకున్న చీర కోసం ఓ రోజుని ప్రత్యేకంగా కేటాయించి మరీ చీర అందాన్ని తెలియజేసేలా ప్రపంచ చీర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది దీన్ని డిసెంబర్ 21న ఘనంగా జరుపుకుంటారు. ఈ దినోత్సవం ఎలా వచ్చింది? ఎందుకు జరుపుకుంటున్నాం తదితరాల గురించే ఈ కథనం!.
'చీర' అనే పదం ఎలా వచ్చిందంటే..
సంస్కృతంలో "చీర" అనే పదానికి "వస్తానికి సంబంధించిన స్ట్రిప్(చిన్న ముక్క)" అని అర్ధం. కానీ సహస్రాబ్దాలుగా పట్టు, దూది లేదా నారతో ధరించే భారతీయ స్త్రీలకు, పురుషులకు ఈ వస్త్రాలు కేవలం సాధారణ వస్త్రాలు మాత్రం కాదు. వాటిని వారు ఎంతో విలువైన వాటిగా చూస్తుంటారు. ఆ చీరతో ముడిపడి ఉన్న బంధాలు, జ్ఞాపకాలు వారి కళ్ల ముందు కదలాడుతుంటాయి.
ఈ దినోత్సవం ఎలా ఏర్పడింది..?
2020లో ఫ్యాషన్ ప్రియులు సింధూర కవిటి, నిస్తుల హెబ్బార్ అధికారిక 'వరల్డ్ చీర దినోత్సవం' ఉద్యమాన్ని ప్రారంభించారు. వారు దీని గురించి ఒక ప్రత్యేక తేదీని (డిసెంబర్ 21వ తేదీ)ని సూచించారు. మన దేశ సరిహద్దులు దాటి చీరకు సంబంధించిన సాంస్కృతిక ప్రాముఖ్యతను ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడమే లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్‌లు.
ఇక ఈ చీరలు లేకుంటే ప్రపంచం రంగుల మయం కాదు. చాలా ఏళ్ల నుంచి భారతీయ సంస్కృతిలో ఈ చీరలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. అలాగే ఫ్యాషన్ పరంగా కూడా ఈ చీరలే అగ్రస్థానంలో ఉన్నాయి. సౌలభ్య పరంగానే కాకుండా ఆకట్టుకునే స్థాయిలో చీరదే తొలిస్థానం. ఏ పండుగైన ఒక్క చీరతో సంప్రదాయం ఉట్టిపడి నిండుదనం తీసుకురావడమే గాక అలనాటి రోజుల్లోకి తీసుకుపోతుంది.
ఎందుకు జరుపుకుంటున్నాం అంటే..
ఈ పండుగ ప్రధానా ఉద్దేశ్యం వీటిని ఎంతోకష్టపడి తయారు చేసే కార్మికుల నైపుణ్యాన్ని గుర్తించడమే గాక ఎప్పటికప్పుడూ వైవిద్యాన్ని ప్రదర్శిస్తూ సరికొత్తచీరలను మన ముందుకు తీసుకొస్తున్న వారి కళ నైపుణ్యతను కొనియాడాల్సిందే. కనీసం ఈ సందర్భంగానైనా..ఒక చీర కోసం కార్మికులు పడే శ్రమ, ఎంతలా ఓపికతో చేస్తే ఓ చీర మన ముందుకొస్తుందో కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి దాని గొప్పదనాన్ని గుర్తించాలి. వేల ఏళ్ల నాటి నుంచి ఉన్న మహిళల అవసరాలకు తగ్గట్టుగా ఆ చీరలో మార్పులు సంతరించుకుంటూ తన క్రేజ్‌ని చాటుకుంటూనే వచ్చింది. ఎన్ని రకాల ఫ్యాషన్ డ్రస్‌లు వచ్చినా చీర అందం ముందు బలదూర్ అని ఫ్రూవ్ చేసుకుంది.
ఆధునికంగా 'చీర కట్టు' విధానం..
నిజానికి భారతదేశంలో చీర బ్లౌజ్ లేకుండా ధరించేవారు. కనీసం శారీ పెట్టికోట్లు ఉండేవి కావు. అయితే చీర మాత్రం ఓ మోస్తారు మందంతో ఉండి, మోకాలి వరకు ధరించేవారు. అయితే ఆ చీరతో బయటకు రావడం కాస్త ఇబ్బందిగా ఉండేది కూడా. అయితే ఆ రోజుల్లో మహిళలు రావడం కూడా అరుదు కావడంతో అలానే చీరలు ధరించేవారు. ఆ తర్వాత నెమ్మదిగా మార్పులు రావడం, మహిళలకు కూడా బటయకు రావడం జరిగింది. వారు కూడా పురుషులతో సమానంగా ఉద్యోగాలు చేయడంతో చీర ఆహార్యంలో మార్పులు వచ్చాయి. సౌలభ్యంగా ధరించేలా చీరలో కాలనుగుణంగా పలుమార్పులు వచ్చాయి.
అయితే ఆధునికంగా చీర కట్టుకునే విధానం మాత్రం ఠాగూర్ కుటుంబం నుంచే వచ్చిందిన చెబుతున్నారు ప్రొఫెసర్-రచయిత జస్వీందర్ కౌర్. ఆయన భారతీయ వస్త్రధారణలో ఎలా కాలనుగుణంగా మార్పులు వస్తూ అభివృద్ధి సాధించిందే పంచుకుంటూ ఆదునిక చీర కట్లు విధానం గురించి మాట్లాడారు. ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ కుటుంబసభ్యలచే ప్రాచుర్యం పొందిందని చెప్పారు. అందుకు సంబంధించిన ఓ ఆసక్తికర కథనాన్ని కూడా పంచుకున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ కోడలు జ్ఞానదానందిని దేవి ద్వారా ఆధునిక చీర కట్టు విధానం ప్రాచుర్యం పొందిందని చెప్పుకొచ్చారు.
ఠాగూర్ సోదరుడు సత్యేంద్రనాథ్ ఠాగూర్ భాతర సివిల్ సర్వీస్ చేరిన తొలి భారతీయుడు. ఆ టైంలో భారతీయ స్త్రీలు ధరించే చీర విధానంతో బయటకు రావడం కాస్త ఇబ్బందిగా ఉండేది. దీన్ని ఆమె ఠాగూర్ విశ్వభారతి పత్రికలో కూడా ప్రస్తావించారు. అయితే కోల్‌కతాలో వైస్రాయి రిసెప్షన్‌లో సత్యేంద్రనాథ్ అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆమె తక్షణమే వెళ్లాల్సిన పరిస్థితి అయితే అప్పుడే ఆమె హుందాగా ఆధునికంగా కొత్త పద్ధతిలో(బ్లౌజ్‌తో తలపై ముసుగు వేసుకుని) ధరించి వెళ్లారు. అప్పటి నుంచే అందరూ దీన్ని అనుసరించనట్లుగా ఓ ఆసక్తికర కథనాన్ని జస్వీందర్ వెల్లడించారు. అందుకే కోసం ఎన్ని రకాల విచిత్ర వస్త్రధారణ వచ్చిన చీర ధరించడం కనుమరుగవ్వలేదు. ఎప్పటికీ ఎవర్ గ్రీన్‌గా తన క్రేజ్‌ని చాటుకుంటునే ఉంది.
(చదవండి: డయానా ధరించిన డ్రెస్ ధర ఏకంగా రూ. 9 కోట్లు! మరోసారి రికార్డు స్థాయిలో..)
Comments
Please login to add a commentAdd a comment