పునరావృతం కావడం అన్నది చరిత్రకున్న సహజ లక్షణమే అయినా... ఎన్డీఏ ఏడున్నరేళ్ల పాలనలో పదేపదే ఒకే రకమైన ఆక్షేపణీయ దృశ్యాలు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆవిష్కృతం కావడం నేడు దేశవ్యాప్తంగా చర్చ నీయాంశంగా మారింది.
మన దేశంలో అన్ని స్థాయుల లోని చట్టసభలకు ఆదర్శంగా నిలిచేది, నిలవాల్సింది భారత పార్లమెంటే. భారత రాజ్యాంగంలోని 2వ అధ్యా యంలో ఆర్టికల్ 79 నుండి 122 వరకు... పార్లమెంట్ ఏర్పాటు, పార్లమెంట్ పనితీరు, విధివిధానాలను తెలియ జెపుతాయి. పార్లమెంట్‌కు ఎన్నికయ్యే వారు ఈ అధికరణ లపై పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. మొత్తం రాజ్యాం గంపై అవగాహన కల్పించుకోవల్సిన అవసరం, బాధ్యత కూడా ప్రతి సభ్యుడిపై ఉంటుంది. సాధారణంగా పార్ల మెంట్ సభ్యులు తమ ప్రసంగాలు, ప్రవర్తన ద్వారా పార్లమెంట్ ఔన్నత్యాన్ని పెంచాలని అందరూ భావిస్తారు. పార్లమెంట్‌కు సంబంధించి లిఖితమైన పలు నిబంధనల తోపాటూ... స్థిరపడిన అత్యున్నత ప్రమాణాలూ ఉన్నాయి. అలాగే పార్లమెంట్‌ను అగౌరవపర్చే విధంగా ఏ సభ్యుడూ ప్రవర్తించకూడదన్న నియమావళి కూడా ఉంది. వీటివల్లనే పార్లమెంట్‌ను ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదికగా పరిగ ణిస్తారు.
పార్లమెంట్ ప్రజావేదికే తప్ప రాజకీయ వేదిక కాదు. ఉభయ సభల్లో ఆయా సందర్భాలలో రాజకీయాల ప్రస్తా వన అనివార్యం అయినా... కేవలం రాజకీయ లబ్ధి కోసం కాక, ప్రజాబాహుళ్యానికి మేలు చేసేందుకు ఆయా అంశా లపై తగిన వివరణ ఇవ్వాల్సిన అవసరం అధికార పార్టీకి ఉంటుంది. అలాగే, అధికార పార్టీ వైఫల్యాలను ప్రశ్నించే క్రమంలో ప్రతిపక్షాలు సైతం కొన్నిసార్లు రాజకీయ వ్యాఖ్యలు తప్పనిసరిగా చేస్తాయి. అయితే ఇవన్నీ... పార్ల మెంట్ బిజినెస్‌లో భాగంగానే చూడాలి. కాగా, ఇటీవలి కాలంలో పార్లమెంట్‌లో ఒక్క ప్రజాహితానికి సంబంధిం చిన అంశాలు తప్ప మిగతావన్నీ ప్రస్తావిస్తున్నారు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి అధికార, విపక్షాలు పోటీపడి ‘పార్లమెంట్’ను ఫక్తు రాజకీయ వేదికగా ఉపయోగించు కుంటున్నాయి. ఇందుకు తాజాగా జరిగిన పలు ఉదంతా లను పేర్కొనవచ్చు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో ఆనవాయితీ ప్రకారం రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మా నంపై మాట్లాడిన కాంగ్రెస్ సభ్యుడు రాహుల్ గాంధీ... నిర్దిష్టంగా కొన్ని ప్రభుత్వ వైఫల్యాలను, ఇతర అంశాలను ఎత్తిచూపారు. అందులో కీలకమైన భారత్–చైనా సరిహద్దు ప్రాంతంలో చైనా దురాక్రమణకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. అలాగే రాఫెల్, పెగసస్ తదితర ముఖ్యమైన అంశాలున్నాయి. అయితే, రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశా లకు సభలో జవాబులు దొరకలేదు. ప్రధాని నరేంద్ర మోదీ... ఇంతకు ముందెన్నడూ లేని విధంగా... కీలక అంశాలను స్పృశించకుండా వాటిని దాట వేశారు. మోదీ ప్రసంగం రాజకీయంగా సాగింది. కాంగ్రెస్ పార్టీ గత 7 దశాబ్దాలలో చేపట్టిన అనేక అప్రజాస్వామ్య విధానాలను మోదీ తన ప్రసంగంలో ఎత్తిచూపారు. ఆ క్రమంలోనే 2014లో ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014’ను అత్యంత అవమానకర రీతిలో ఆమోదింప జేశారంటూ విమర్శలు చేశారు. అయితే, ఆనాడు విభజన బిల్లు హడా విడిగా ఆమోదం పొందడంలో బీజేపీ పోషించిన పాత్రను ఆయన మర్చిపోయినట్లు ఉన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించడాన్ని ఎవ్వరూ తప్పు పట్టరు. కానీ, పార్లమెంట్‌లో ప్రజాసమస్యలను వదిలేసి ప్రసంగం మొత్తం కాంగ్రెస్ పార్టీ చుట్టూనే తిప్పడాన్ని ఎవరు హర్షిస్తారు? గతంలో కూడా పార్లమెంట్‌ను ఓ రాజకీయ వేదికగా మార్చి, పరస్పర రాజకీయ ఆరోపణలు చేసుకొన్న ఉదంతాలు కోకొల్లలుగా ఉన్న మాట నిజమేగానీ... ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలన్నిం టినీ దాటవేసి ‘‘నేను చెప్పిందే జవాబు’’ అనే విధంగా ప్రధాని వ్యవహరించడం బహుశా ఇదే మొదటిసారేమో!
దేశంలో ఎందుకు తాము పార్లమెంటరీ విధానానికి మొగ్గు చూపాల్సి వచ్చిందో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వివరిస్తూ ‘‘అధ్యక్షతరహా పాలనలో ప్రభుత్వం సుదృఢంగా ఉండేమాట నిజం. కానీ, పార్లమెంటరీ ప్రజా స్వామ్య వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు జవాబు దారీగా ఉంటుంది. చట్టాల రూపకల్పనలో దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షల్ని ప్రతిబింబించడానికి సభ్యులు చొరవ చూపుతారు. వారు బిల్లులను కూలంకుషంగా స్క్రూటినీ (శూలపరీక్ష) చేస్తారు, చర్చిస్తారు. ప్రజలకు హితంకాని అంశాలను బిల్లులోంచి తొలగించేందుకు పట్టుబడతారు. అప్పటికీ పాలకపక్షానికీ, విపక్షాలకీ మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే సదరు బిల్లులను సెలక్ట్ కమిటీకీ, ఇతర పార్లమెంట్ కమిటీలకూ పంపుతారు. ఇక, ప్రజా సమస్యల్ని లేవనెత్తడానికి అనేక అవకాశాలు, అనేక రూపాల్లో పార్ల మెంట్ ప్రతి సభ్యుడికీ అవకాశం కల్పిస్తుంది. ఈ పద్ధతిలో పార్లమెంట్ పని చేయడం వల్ల ప్రజాస్వామ్యం బలపడు తుంది. ప్రజల ప్రయోజనాలు పరిరక్షించబడతాయి’’ అని పేర్కొన్నారు.
డిబేట్స్ (వాదనలు), డిస్ప్యూట్స్ (వివాదాలు), డైలాగ్ (చర్చ) అన్నవి పార్లమెంట్ ఆత్మగా పరిగణిస్తారు. పార్ల మెంట్ సంస్థాగత సామర్థ్యం ఎంత గొప్పగా ఉంటే, ప్రజా స్వామ్యం అంత బలంగా ఉంటుంది. దేశంలో ప్రజాస్వా మిక వ్యవస్థలు, రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నంత మాత్రాన దేశం ప్రజాస్వామ్య దేశం కాబోదు. ఆ వ్యవస్థలన్నీ తమ బాధ్యతలను, విధులను సక్రమంగా నిర్వహించాలి. వాటిని నిర్వహించే వారికి వాటిపట్ల నమ్మకం, గౌరవం ఉండాలి. ప్రజాస్వామ్యానికి వాటిల్లిన అతిపెద్ద జబ్బు ‘పార్లమెంటరీ పెరాలిసిస్’. చచ్చుబడిన చట్టసభల వల్ల దేశం పురోగమిం చదు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే, పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు అన్ని చట్టసభలు సమర్థంగా పని చేయాలి. అందుకు పార్లమెంట్ దిక్సూచి కావాలి. ప్రజాస్వా మ్యానికి ప్రాణదీపం.. పార్లమెంటే!
వ్యాసకర్త: సి. రామచంద్రయ్య
శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్
ప్రజాస్వామ్య ప్రాణదీపం పార్లమెంట్
Published Fri, Feb 25 2022 1:08 AM | Last Updated on Fri, Feb 25 2022 1:09 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment