వేల ఏళ్లుగా నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో అనేక కులాలు వివ క్షకు గురవుతూ వస్తున్న నేప థ్యంలో మొదటిసారిగా బ్రిటిష్ ప్రభుత్వం... 1935 ప్రత్యేక చట్టాన్ని అనుసరించి 1936లో షెడ్యూల్డ్ కులాల జాబితాను ప్రకటించింది. అంతకుముందు వీరిని డిప్రెస్డ్ తరగతులుగా పరి గణించేవారు. భారత రాజ్యాంగం ఆర్టికల్స్ 341, 342 ద్వారా రాష్ట్రపతి షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల జాబితాలను ప్రకటిస్తారు. ఒక కులాన్ని షెడ్యూల్డ్ కులంగా గుర్తించాలంటే సామాజిక, విద్యా, ఆర్థిక వెనుక బాటులతో పాటుగా అస్పృశ్యతను అనుభవిస్తూ ఉండాలి. షెడ్యూల్డ్ తెగగా గుర్తించాలంటే సంబంధిత తెగ ప్రత్యేక భాష, ప్రత్యేక ఆచారాలు కలిగి... అడవుల్లో వంశపారంపర్య వృత్తితో జీవిస్తూ ఉండాలి. కేంద్ర ప్రభుత్వం 105వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 342ఏను సవరిస్తూ... కేంద్ర ఓబీసీ జాబితాలో ఏదైనా కులాన్ని చేర్చాలంటే కేంద్రానికీ, రాష్ట్ర బీసీ జాబితాలో ఏదైనా కులాన్ని చేర్చాలంటే ఆయా రాష్ట్రాలకూ అధికా రాలు కల్పించింది.
కేంద్ర ప్రభుత్వం 1950లో, రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా దేశంలో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) జాబితాను విడుదల చేస్తూ, ఉత్తర్వులోని 3వ పేరాలో షెడ్యూల్డ్ కులాలుగా గుర్తించిన వారందరూ తప్పనిసరిగా హిందూమతంలో కొనసాగాలని నిబంధన పెట్టింది. అదే పంజాబ్ రాష్ట్రంలోని రాందాసి, కాబీర్ పంథి, మజాబి, సిక్లిగర్ కులాలు మాత్రం సిక్కుమతంలో కొనసాగవచ్చని తెలి పింది. తదనంతరం 1990లో రాష్ట్రపతి ఉత్తర్వులను సవ రణ చేస్తూ షెడ్యూల్డ్ కులాల వారు తప్పనిసరిగా హిందూ లేదా సిక్కు లేదా బౌద్ధమతంలో కొనసాగాలని నిబం ధన పెట్టారు. ఒకవేళ ఇతర మతంలోనికి మారితే షెడ్యూల్డ్ కులం హోదాను కోల్పోయి ఓబీసీగా గుర్తింపు పొందుతారు. 1956లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా దేశంలో ఎస్టీ జాబితాను ప్రకటించారు. వీరికి ఎలాంటి మత నిబంధనలు లేవు.
కేంద్ర ప్రభుత్వం 1975లో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం... ఎవరైనా షెడ్యూల్డ్ కులానికి చెందినవారు ఇతర మతాలు... అనగా క్రైస్తవ లేదా ముస్లిం మతం లేదా జైనమతంలోకి మారిన వారికి ఎస్సీలకు కల్పిస్తున్న ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవు. అదే విధంగా కొంత కాలం తర్వాత వారి పూర్వమతం అయిన హిందూ/ సిక్కు/బౌద్ధ మతానికి మారితే వారికి షెడ్యూల్డ్ కుల హోదా, రిజర్వేషన్లు పొందే వెసులుబాటు కల్పించారు.
దేశంలో దళిత క్రైస్తవులు తమను షెడ్యూల్డ్ కులా లుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి మనదేశంలో మతం మారినంత మాత్రాన సామాజిక అసమానతలు, అంటరానితనం పోవడం లేదు. ఎందు కంటే దేశంలో మెజారిటీ ప్రజలు హిందువులు. ఈ మతంలో నిచ్చెనమెట్ల కులవ్యవస్థ పోలేదు. దేశ వ్యాప్తంగా దళిత క్రైస్తవులపై వేలసంఖ్యలో అత్యా చారాలు జరుగుతున్నాయి. సామాజిక భద్రతలో భాగంగా, వీరు అత్యాచార నిరోధక చట్టాన్ని వినియో గించుకునే అవకాశం లేకుండా పోతోంది. పూర్వం షెడ్యూల్డ్ కులాలవారికి హిందూ దేవాలయాల్లోకి ప్రవేశం లేదు, కావున వారు ప్రత్యామ్నాయంగా ఇతర మతాల్లోకి మారడం సహజంగానే చూడాలి.
భారత రాజ్యాంగంలో షెడ్యూల్డ్ కులానికి చెందిన వారు మతం మారితే షెడ్యూల్డ్ కులాల హోదా, రిజ ర్వేషన్లు కోల్పోతారని పేర్కొనే ఎలాంటి నిబంధనలు లేవు. కేవలం రాష్ట్రపతి ఉత్తర్వులలో మాత్రమే నిబంధన పెట్టారు. మొదట హిందూమతంలో కొనసాగాలని చెప్పారు. తరువాత సవరించిన సిక్కు లేదా బౌద్ధ మతా లలో కొనసాగవచ్చని తెలిపారు. అందుకే దేశవ్యాప్తంగా దళిత క్రైస్తవులు రాష్ట్రపతి ఉత్తర్వు–1950లోని 3వ పేరాను సవరించి వారికి షెడ్యూల్డ్ కులాల హోదాను కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సత్వర నిర్ణయం తీసుకొని వీరికి న్యాయం చెయ్యాలి.
వ్యాసకర్త: కోడెపాక కుమారస్వామి
జాతీయ అధ్యక్షులు, ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం
వారూ, వీరూ ఎదుర్కొనే పీడన ఒక్కటే!
Published Thu, Jan 20 2022 12:53 AM | Last Updated on Tue, Jul 26 2022 3:20 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment