క్రీడారంగంలో సరికొత్త అవకాశాలు! | New opportunities in field of sports in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

క్రీడారంగంలో సరికొత్త అవకాశాలు!

Published Wed, Nov 15 2023 4:32 AM | Last Updated on Wed, Nov 15 2023 4:32 AM

New opportunities in field of sports in Andhra Pradesh - Sakshi

వినూత్నమైన పథకాలూ, పాలనతో ఆంధ్రప్రదేశ్‌ను ముందుకు నడిపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి క్రీడారంగంలోనూ తన దైన ముద్రకు శ్రీకారం చుట్టారు. ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో క్రీడల పండుగకు రూపకల్పన చేసి యువతకు క్రీడా రంగంలో సరికొత్త అవ కాశాలు అందించేందుకు సిద్ధమయ్యారు.రాష్ట్ర ప్రభుత్వం 2023–28 క్రీడా పాలసీ ద్వారా ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడల సంబరానికి తెరలేపింది. గత జూన్‌ నెలలో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసి క్రీడా పాలసీకి రూపకల్పన చేసింది.  

నవంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 26 జిల్లాలు, 175 నియోజకవర్గాలు, 680 మండలాలు, 4000 సచివాలయాల పరిధిలో, 11 వేల గ్రామ పంచాయితీల స్థాయిలో మూడు లక్షల మ్యాచ్‌లు నిర్వహించడానికి  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల మంత్రిత్వ శాఖ ‘శాప్‌’ కలిసి ఏర్పాటు చేయడం ఓ చారిత్రక ఘట్టం. 

క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కోకోతో పాటు, యోగా, మార«థాన్, టెన్నికాయిట్‌లలో పోటీలు జరుగుతాయి. నేటి యువత అత్యంత ఇష్టపడే క్రికెట్‌కు రాష్ట్ర ప్రభుత్వం అగ్ర తాంబూలం ఇవ్వడం శుభపరిణామం. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి ఐపీఎల్‌ తరహా టీమ్‌ తయారు చేయాలనీ, అందుకు అంబటి రాయుడును మెంటార్‌గా నియమించాలనీ, తదుపరి చెన్నై సూపర్‌ కింగ్స్‌తో వారికి ప్రత్యేక శిక్షణనివ్వాలనీ ముఖ్యమంత్రి జగన్‌ ఈ క్రీడా పాలసీని ఆవిష్కరిస్తూ అధికారులను ఆదేశించారు.

ఈ పాలసీలో ఉన్న గొప్పతనం ఏమిటంటే... చదువుకున్న వాళ్లే  కాకుండా 17 సంవత్సరాలు నిండిన సాధారణ రాష్ట్ర పౌరులు అందరూ పాల్గొనేందుకు అర్హత  కల్పించడం. బాల బాలికలకు వేరు వేరుగా ఈ పోటీలను నిర్వహిస్తారు. మొదటిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదకొండు వేల గ్రామాల నుండి క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం ద్వారా శిక్షణ ఇస్తారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల ద్వారా దీనికి సంబంధించిన ప్రకటన జారీ అయింది. ఇందు కోసం ఇప్పటికే హై స్కూల్స్, అందుబాటులో ఉన్న క్రీడా ప్రాంగణాలను ఉపయోగించు కొంటున్నారు.

మండల స్థాయిలోనే క్రీడా సామగ్రి అందుబాటులో ఉంచారు. క్రీడల వల్ల మానసిక వికాసం, శారీరక దారుఢ్యంతో పాటు బృంద స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవచ్చు.  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల క్రీడాకారులతో స్నేహ సౌభ్రాతృత్వాలు పెరుగుతాయని క్రీడా పాలసీ తెలుపు తోంది. ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడాపోటీల్లో రాష్ట్ర స్థాయిలో గెలిచిన వారికి మొదటి బహుమతిగా రూ. 50 వేలు, రెండో బహుమతిగా 30 వేలు, మూడవ బహుమతిగా 20 వేలు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ చేతుల మీదుగా అందుకొంటారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభా పాట వాలు ప్రదర్శించిన క్రీడాకారులకు రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి, శాప్‌ చైర్మన్‌ సమక్షంలో అభినందన పత్రాలు బహూకరిస్తారు.

‘ఆడుదాం ఆంధ్ర’ ద్వారా క్రీడా ఉపకర ణాలు ఉచితంగా అందించడం, నియోజక వర్గం స్థాయిలో స్టేడియాలు నిర్మించడానికి సన్నాహాలు చేయడం, హైస్కూల్‌ స్థాయిలో గ్రౌండ్‌లను  ఆధునికీకరించడం  ఆహ్వానించ దగ్గ పరిణామాలు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలన్నీ ఆంధ్రప్రదేశ్‌ను క్రీడా హబ్‌గా మారు స్తాయనడంలో సందేహం లేదు. 

డా‘‘ గుబ్బల రాంబాబు 
వ్యాసకర్త సామాజిక కార్యకర్త
మొబైల్‌: 98498 47489 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement