శివయ్య కల్యాణం.. నయన మనో‘హర’ం
చేబ్రోలు: చారిత్రక ప్రసిద్ధి చెందిన చేబ్రోలులోని గంగా పార్వతీ సమేత నాగేశ్వరస్వామి రథోత్సవం భక్తుల హరనామ స్మరణతో గురువారం స్థానిక పుర వీధుల్లో అత్యంత వైభవంగా జరిగింది. వంద సంవత్సరాల పురాతన భారీ రథంపై కొలువైన కల్యాణమూర్తులను దర్శించడానికి చేబ్రోలు పరిసర గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారు. మహా శివరాత్రి సందర్భంగా నాగేశ్వరస్వామి దేవాలయంలో కల్యాణోత్సవాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. కల్యాణోత్సవం అనంతరం ఉత్సమూర్తులైన నాగేశ్వరస్వామి, గంగాదేవి, పార్వతీదేవి అమ్మవార్లను రథం మీద చేబ్రోలు పురవీధుల్లో విహరించారు. పాత పోలీసు స్టేషన్ సమీపంలో కొద్ది సేపు ఆపి గంగానమ్మ తల్లికి పూజలు చేశారు. భక్తులకు గ్రామస్తులు పులిహోర, పొంగలి, మజ్జిగ తదితర ప్రసాదాలను పంపిణీ చేశారు. చేబ్రోలు పరిసర గ్రామాలకు చెందిన వేలాది మంది భక్తులు రథం తాడును లాగడానికి ఉత్సాహం చూపారు. మహిళలు, పిల్లలు,యువకులు రథోత్సవంలో పెద్దఎత్తున పాల్గొన్నారు. ఏర్పాట్లను దేవాదాయశాఖ ఈవో పర్యవేక్షించారు.
కనుల పండువగా కల్యాణోత్సవం
లింగోద్భవ కాలంలో స్వామి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక అలంకారంలో స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. కల్యాణోత్సవం అనంతరం నంది వాహనంపై కల్యాణమూర్తులు భక్తులకు దర్శనమిచ్చారు.
తిరునాళ్ల శోభ.. ప్రభల కాంతులు
క్వారీ తిరునాళ్లలో భారీ విద్యుత్ ప్రభల కాంతులు వెలుగులు నింపాయి. జిల్లాలో కోటప్ప కొండ తరువాత పేరు గాంచిన వడ్లమూడి క్వారీ తిరునాళ్లకు ఈ ఏడాది వివిధ గ్రామాల నుంచి బారీ విద్యుత్ ప్రభలు తరలివచ్చాయి. క్వారీ ఆలయం ప్రాంగణం వద్ద చేబ్రోలు గ్రామ భారీ విద్యుత్ ప్రభ వెలుగులు నింపింది. నారాకోడూరు, గొడవర్రు, గుండవరం, వడ్లమూడి, సుద్దపల్లి, వడ్లమూడి, శలపాడు తదితర గ్రామాల నుంచి భారీ విద్యుత్ ప్రభలు తరలివచ్చాయి.
వైభవంగా నాగేశ్వరస్వామి రథోత్సవం
హర హర నామస్మరణతో మార్మోగిన చేబ్రోలు పుర వీధులు
వైభవంగా క్వారీ బాలకోటేశ్వరుని
తిరునాళ్ల
ఆకట్టుకున్న భారీ విద్యుత్ ప్రభలు
శివయ్య కల్యాణం.. నయన మనో‘హర’ం
Comments
Please login to add a commentAdd a comment