నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్‌టికెట్లను వైట్ పేపర్‌పై ప్రింటవుట్ తీసుకొని పరీక్ష కేంద్రాలకు రావాలని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి ఎం.నీలావతిదేవి సోమవారం తెలిపారు. కొందరు విద్యార్థులు హాల్‌టికెట్లను కలర్ ప్రింట్‌లో తీసుకువస్తున్నారని, వాటిని అనుమతించటం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఇంటర్మీడియెట్ విద్యామండలి నుంచి ప్రత్యేక ఉత్తర్వులు అందినట్టు వివరించారు. విద్యార్థులు గమనించి తమ వెంట తెల్లకాగితంపై ప్రింట్ చేసిన హాల్‌టికెట్లతో హాజరు కావాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment