టెన్త్ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు
గుంటూరు ఎడ్యుకేషన్: ఈనెల 17 నుంచి జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక చెప్పారు. ఆమె ‘‘సాక్షి’’తో మాట్లాడుతూ జిల్లాలో టెన్త్ పబ్లిక్ పరీక్షలకు 30,410 మంది విద్యార్థులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో 150 కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. ఈనెల 17 నుంచే జరగనున్న దూరవిద్య టెన్త్ పబ్లిక్ పరీక్షలకు రెగ్యులర్ కేంద్రాల్లోనే ప్రత్యేకంగా గదులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరీక్ష కేంద్రాల్లో ఫర్నిచర్‌తోపాటు వేసవి దృష్ట్యా ఫ్యాన్ల ఏర్పాటు, చల్లని తాగునీరు, టాయిలెట్లు మౌలిక వసతుల కల్పనపై పూర్తిస్థాయిలో దృష్టి సారించినట్లు వివరించారు.
జిల్లా జైలులో తొలిసారిగా పరీక్ష కేంద్రం
ప్రస్తుత ఏడాది దూరవిద్య టెన్త్ పరీక్షల కోసం జిల్లా జైలులోని ఖైదీలకు తొలిసారిగా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు డీఈఓ చెప్పారు. అక్కడ పరీక్ష రాసే ఖైదీల కోసం చీఫ్ సూపరింటెండెంట్, డీవోను నియమిస్తున్నట్లు వివరించారు.
హాల్ టికెట్‌తో నేరుగా పరీక్ష రాసేందుకు
వెళ్లవచ్చు
● పరీక్ష ఫీజు చెల్లించిన ప్రతి విద్యార్థికీ ప్రభుత్వ పరీక్షల విభాగం హాల్ టికెట్ జారీ చేసిందని, హాల్ టికెట్లను పాఠశాలల హెచ్‌ఎం లాగిన్‌లో ఉంచినట్లు డీఈఓ చెప్పారు.
● ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన 95523 00009 నంబరుకు వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ పంపడం ద్వారా హాల్ టికెట్ పొందవచ్చునని వివరించారు.
● డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్లతో విద్యార్థులు నేరుగా పరీక్షలు రాసేందుకు వెళ్లవచ్చునని, ఎవరి అనుమతి అవసరం లేదని స్పష్టం చేశారు.
● ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనుండగా, విద్యార్థులు గంట ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
ఈనెల 17 నుంచి ప్రారంభం
ఫీజు చెల్లించిన అందరికీ
హాల్‌టికెట్లు జారీ
డీఈఓ సీవీ రేణుక
Comments
Please login to add a commentAdd a comment