సీనియార్టీ జాబితాలో లోపాలు సవరించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యాశాఖ విడుదల చేసిన మున్సిపల్ ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాలో లోపాలను సవరించాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుకకు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ (ఎన్‌టీఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.హైమారావు విజ్ఞప్తి చేశారు. గురువారం డీఈవో కార్యాలయంలో రేణుకను కలసిన ఎన్‌టీఏ నాయకులు ఆమెకు వినతిపత్రం సమర్పించారు. ఉపాధ్యాయుల సీనియార్టీని పరిగణలోకి తీసుకోకపోవడంతో పాటు ఇతర మేనేజ్‌మెంట్‌ల నుంచి వచ్చిన ఉపాధ్యాయులను జూనియర్లుగా చూపలేదని డీఈవో దృష్టికి తెచ్చారు. జాబితాలోని తప్పులను సవరించాలని కోరారు. దీనిపై డీఈవో మాట్లాడుతూ సీనియార్టీ జాబితాలో తప్పులు దొర్లిన నేపథ్యంలో ఉపాధ్యాయులు తగు ఆధారాలతో ఈనెల 10లోపు ఫిర్యాదు చేయాలని సూచించారు. డీఈవోను కలసిన వారిలో ఎన్‌టీఏ గుంటూరు జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ ఖలీల్, గుంటూరు నగర శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సాయి విశ్వనాఽథ్, పి. లలితబాబు, గౌరవాధ్యక్షుడు ఏవీ కృష్ణారావు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment