సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం
బాపట్లటౌన్: సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమైనదని జిల్లా అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయం ఆవరణలో గురువారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఎస్పీ టి.పి.విఠలేశ్వర్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. తొలుత డ్రోన్ ఎగురవేసి అది పనిచేసే విధానం, పోలీస్ శాఖకు ఏవిధంగా ఉపయోగపడుతుందనే విషయాలపై విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. మహిళలకు రక్షణ, భద్రత కల్పించేందుకు పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలు, అత్యవసర పరిస్థితులలో సంప్రదించాల్సిన చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, మహిళలకు సంబంధించిన సమస్యలకు ఉమెన్ హెల్ప్‌లైన్ 181, పోలీస్ శాఖను సంప్రదించేందుకు పోలీస్ హెల్ప్‌లైన్ 112, సైబర్ నేరాలకు గురైతే సంప్రదించాల్సిన సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 గురించి, విధి నిర్వహణలో పోలీసులు వినియోగిస్తున్న వివిధ రకాల ఆయుధాలు, తుపాకులు, బాంబ్ డిస్పోజల్స్ పరికరాలు, పోలీసు డాగ్స్, సాంకేతికత, బాడీ వోర్న్ కెమెరాలు, కమ్యూనికేషన్ విభాగాల్లో వినియోగిస్తున్న పరికరాలపై క్షుణ్ణంగా వివరించారు. నేర స్థల పరిశీలనలో క్లూస్ టీం ఆధారాలు, ఫింగర్ ప్రింట్స్ సేకరించే విధానంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు, ఏఆర్ డీఎస్పీ విజయసారథి, అడ్మిన్ ఆర్‌ఐ మౌలుద్దీన్, మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ శ్రీనివాస్, ఎస్‌బీ సీఐ నారాయణ, బాపట్ల పట్టణ, రూరల్, రూరల్ సర్కిల్ సీఐలు రాంబాబు, శ్రీనివాసరావు, హరికృష్ణ, పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థి దశనుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి జిల్లా అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్
Comments
Please login to add a commentAdd a comment