అకుంఠిత ‘దీక్ష’తో ఐపీఎస్‌గా
నగరంపాలెం: అకుంఠిత దీక్షతో ఐపీఎస్‌గా ఎంపికై యువతకు స్ఫూర్తిగా నిలిచారు ఆమె. ఆమె పేరు దీక్ష. సొంతూరు ఢిల్లీ. హైదరాబాద్‌లో సివిల్స్ శిక్షణ తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 208వ ర్యాంక్ సాధించారు. ప్రస్తుతం ట్రైనీ ఐపీఎస్ అధికారిణిగా గుంటూరులో పనిచేస్తున్నారు. దీక్ష తల్లిదండ్రులు అసోసియేట్ ప్రొఫెసర్లు. ఆమెకు ఇద్దరు సోదరులున్నారు. భర్త ముఖేష్ ఆదాయపుపన్ను శాఖ అధికారి. దీక్ష 2016లో యూపీఎస్‌సీ రాసి ఇండియన్ ఇన్‌ఫర్‌మేషన్ సర్వీస్ అధికారిణిగా ఎంపికై ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)లో విధులు నిర్వర్తించారు. మళ్లీ పోటీ పరీక్షలు రాశారు. 2018లో డీఎస్పీ ర్యాంకు ఆఫీసర్‌గా ఎంపికై ఢిల్లీలో పనిచేశారు. ఐపీఎస్ లక్ష్యంగా ప్రయత్నించారు. 2021లో 208వ ర్యాంక్ సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు.
ఐపీఎస్ కోసం నాలుగేళ్లు కష్టపడ్డా
ఐపీఎస్ సాధించాలనే లక్ష్యంతో నాలుగేళ్లు కష్టపడ్డా. నా లక్ష్యాన్ని చేరుకున్నా. సమాజంలో మహిళలు ముందుండాలి. పట్టుదలతో యత్నిస్తే ఏదైనా సాధించొచ్చు. సమర్థవంతంగా పనిచేసి మంచి అధికారిగా గుర్తింపు తెచ్చుకుంటా. – దీక్ష, ట్రైనీ ఐపీఎస్
Comments
Please login to add a commentAdd a comment