మహిళల భాగస్వామ్యం తప్పనిసరి
తెనాలిరూరల్: అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని సబ్‌కలెక్టర్ సంజనా సింహా అన్నారు. తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు ఎంపీడీవో అత్తోట దీప్తి అధ్యక్షత వహించారు. సబ్ కలెక్టర్ సంజనా సింహా ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మహిళల ప్రాధాన్యాన్ని వివరించారు. మహిళా దినోత్సవ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. వెలుగు ఏపీఎం జయశ్రీ వందన సమర్పణ చేశారు. ఎంపీడీవో కార్యాలయ పరిపాలన అధికారి శ్రీనివాసరావు కార్యక్రమాలను పర్యవేక్షించారు. కార్యక్రమంలో తెనాలి డీఎల్‌డీఓ శ్రీదేవి, పంచాయతీరాజ్ ఏఈ పార్వతి, ఆర్‌డబ్యెస్ ఏఈ అనూష, సీడీపీఓ సునీత పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శనను సబ్ కలెక్టర్ సందర్శించారు.
కాంట్రాక్టు స్టాఫ్‌నర్సు
ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) కార్యాలయం పరిధిలో కాంట్రాక్టు స్టాఫ్‌నర్సు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారి ప్రొవిజనల్ మెరిట్ లిస్టును విడుదల చేసినట్లు ఆర్డీ డాక్టర్ కె.సుచిత్ర తెలిపారు. జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 13వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఉన్న ఆర్డీ కార్యాలయంలో తెలియజేయాలని పేర్కొన్నారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 44 కాంట్రాక్టు స్టాఫ్‌నర్సు ఉద్యోగాలకు గత ఏడాది డిసెంబరు 30న నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. నోటిఫికేషన్‌లో 44 కాంట్రాక్టు స్టాఫ్‌నర్సు ఉద్యోగాలు ఉన్నాయని, 5,888 మంది ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు.
స్వచ్ఛాంధ్ర పోస్టర్ల ఆవిష్కరణ
గుంటూరు రూరల్: స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా ముద్రించిన పోస్టర్లను కలెక్టర్ నాగలక్ష్మి శుక్రవారం ఆవిష్కరించారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, నగర కమిషనర్ శ్రీనివాసులు, తెనాలి సబ్ కలెక్టర్ సంజనాసింహా, డీఆర్‌ఓ షేక్ ఖాజావలి, డీపీఓ సాయికుమార్, రూరల్ మండలం ఎంపీడీవో బండి శ్రీనివాసరావు, విస్తరణ అధికారి కె శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ప్రపంచ శాంతి కోసమే గుడారాల పండుగ
అమరావతి: ప్రభువైన ఏసుక్రీస్తుచే తేజరింపచేసి ప్రపంచంలోని మానవులందరి ఉజ్జీవం కోసం గుడారాల పండుగలో ప్రార్థనలు చేస్తున్నామని హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుడు, దైవజనులు ఫాస్టర్ అబ్రహం అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని హోసన్నా దయాక్షేత్రంలో హోసన్నా మినిస్ట్రీస్ నిర్వహించే 48వ గుడారాల పండుగ రెండవ రోజు రాత్రిపూట ప్రార్థనలకు వచ్చిన లక్షలాది మంది ఆరాధికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ఈ పండుగలో విశ్వాసులు, సేవకులు ఉజ్జీవింపబడాలంటే దేవుని చేత ప్రకాశించి, వాక్యం మీద ఆసక్తి కలిగి దేవుని ప్రార్థనే ఊపిరిగా భావించాలన్నారు. అనంతరం రెండవ వర్తమానంలో హోసన్నా మినిస్ట్రీస్ చీఫ్ పాస్టర్ జాన్‌వెస్లీ ప్రసంగించారు.
మహిళల భాగస్వామ్యం తప్పనిసరి
మహిళల భాగస్వామ్యం తప్పనిసరి
Comments
Please login to add a commentAdd a comment