
కల్యాణ వేంకటేశ్వరస్వామి ఉత్సవాలు
దుగ్గిరాల: దుగ్గిరాల పసుపుయార్డు సమీపంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో రెండో శనివారం వేడుకలు ఘనంగా జరిగాయి. దేవాలయంలో సుప్రభాతసేవ, నవనీత హరతి, నిత్య కై ంకర్యాలు, నవకుంభారాధన, నరసింహ హోమం, సాయంత్రం నిత్య హోమం, ఆలయ బలిహరణ జరిగాయి. భక్తులకు అన్నదానం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అర్చకులు సాకేత్ శర్మ, రామచంద్రలు పర్యవేక్షించారు.
బార్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
గుంటూరు లీగల్ : బార్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. మార్చి 27వ తేదీన జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్‌కు ఎన్నికలు జరుగుతాయని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాసు వెంకటరెడ్డి వెల్లడించారు. 2025–26 ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయినట్లు శనివారం ఆయన తెలిపారు. 12న ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 13న నామినేషన్‌ల స్వీకరణ ఉదయం 11 – సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందన్నారు. ఈ నెల 17వ తేదీన నామినేషన్‌ల పరిశీలన, 18న ఉపసంహరణ ఉంటుందన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా 27న ప్రకటిస్తారన్నారు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
శతచండీ మహాయాగం
సత్తెనపల్లి: పట్టణంలోని భవిష్య పాఠశాల సమీపంలో గల త్రిశక్తి దుర్గాపీఠంలో శతాధిక ప్రతిష్టా బ్రహ్మ, దేవి ఉపాసకులు, విశ్వ ధర్మ పరిరక్షణ వేదిక కోశాధికారి, పరమ పూజ్య హనుమత్‌స్వామి ఆధ్వర్యంలో పంచాయతన పూర్వక నవదుర్గాత్మక శత చండీ మహాయాగం శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చండీ పారాయణం, శత చండీ హోమం, గురువందనం, ప్రధాన దేవతా అర్చన, శత చండీహోమం, లలిత సహస్ర నామార్చన, దీపార్చన, హారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ చేపట్టారు. సుదర్శన హోమం, లక్ష్మీనారాయణ హోమం, వాస్తు హోమం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా గణేష్ యువసేన, త్రిశక్తి దుర్గాపీఠం బ్రహ్మోత్సవ కమిటీ, త్రిశక్తి దుర్గాపీఠం మహిళా శక్తి బాధ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
వెంకన్న ఆలయంలో
గోవింద నామస్మరణ
రాజుపాలెం: పల్నాడు తిరుపతిగా పేరుగాంచిన దేవరంపాడు కొండపై స్వయంభూగా వెలసిన శ్రీనేతి వెంకన్నస్వామి రెండవ శనివారం తిరునాళ్లకు భక్తులు పోటెత్తారు. సమీప ప్రాంతాల నుంచే గాక సుదూర ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు దేవరంపాడు కొండకు విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. కొండపై స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు కన్నులారా తిలకించారు. అనంతరం స్వామివార్లను పల్లకీలో ఊరేగించారు. దాతలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం ఈవో గణసతి సురేష్ తెలిపారు.

కల్యాణ వేంకటేశ్వరస్వామి ఉత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment