
అందుబాటులోకి మూడు వంతెనలు
నెహ్రూనగర్: ఎట్టకేలకు మూడు వంతెనల మీదుగా రాకపోకలు శనివారం సాయంత్రం నుంచి ప్రారంభమయ్యాయి. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వీటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రెండు లైన్లుగా ఉన్న మూడు వంతెనలను నాలుగు లైన్లుగా ఆధునికీకరిస్తూ పనులు చేపట్టామన్నారు. రానున్న రోజుల్లో శంకర్ విలాస్ బ్రిడ్జి విస్తరణ పనులు మొదలు పెడతామని వెల్లడించారు. గతంలో వర్షం పడితే మూడు వంతెనలు మునిగే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ సమస్య రాకుండా డ్రైయిన్ నిర్మాణం చేపట్టామని తెలిపారు. ట్రాఫిక్ కష్టాల నుంచి నగర ప్రజలను తప్పించేందుకు ఆక్రమణలు తొలగిస్తున్నామని పేర్కొన్నారు. తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, రైల్వే అధికారులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు అవమానం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజైన శనివారమే పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవికి అవమానం జరిగింది. ఆమె రాకుండానే కేంద్ర మంత్రి పెమ్మసాని మూడు వంతెనలను ప్రారంభించారు. పశ్చిమ నియోజకవర్గం వైపు ప్రారంభ వేడుక ఏర్పాటు చేసినప్పటికీ కనీసం ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే వచ్చేవరకు కూడా వేచి చూడలేదు. హడావిడిగా ఆయన ప్రారంభించేశారు. కొంత మంది టీడీపీ శ్రేణులు దీనిపై విమర్శలు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే లేకుండా ఇలా చేయడం ఏంటని మంత్రి తీరుపై మండిపడుతున్నారు.

అందుబాటులోకి మూడు వంతెనలు
Comments
Please login to add a commentAdd a comment