ఒకేసారి 220 ఎలక్ట్రానిక్ డివైజ్‌ల తయారీ
గుంటూరు ఎడ్యుకేషన్: 220 మంది విద్యార్థులు ఒకే వేదికపై ఎలక్ట్రానిక్ డివైజ్ రూపొందించారు. ఉపాధ్యాయుల సూచనలు ఆలకిస్తూ సర్క్యూట్ బోర్డులతో 220 డివైజ్‌లను వారు తయారు చేశారు. డాక్టర్ చివుకుల హనుమంతరావు చారిటబుల్ ట్రస్ట్ అనుబంధ సంస్థ సుగుణ సైన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం అమరావతి రోడ్డులోని హిందూ ఇంజినీరింగ్ కళాశాల సుధర్మ ఆడిటోరియంలో ‘ఎలైట్ అండ్ ఎనర్జిటిక్ మైండ్స్’ పేరుతో ఈ కార్యక్రమం జరిగింది. నాలుగు చక్రాల వాహనాలను రివర్స్ చేసే సమయంలో ఉపయోగించే అలారంతో కూడిన ఎలక్ట్రానిక్ డివైజ్‌ను విద్యార్థులు తయారు చేశారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు కోసం ఈ కార్యక్రమం చేపట్టారు. గుంటూరులోని శ్రీపాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్‌తోపాటు వెంకటకృష్ణాపురంలోని సిద్దార్థ హైస్కూల్‌కు చెందిన 220 మంది విద్యార్థులు పాలుపంచుకున్నారు. సుగుణ సైన్స్ అకాడమీ సీఈవో డాక్టర్ చివుకుల సాంబశివరావు అధ్యక్షత వహించారు. ప్రత్యేక పరిశీలకుడు పత్రి వేణుగోపాల్ సారథ్యంలో డివైజ్‌లు తయారు చేయించారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ రాష్ట్ర చీఫ్ కో ఆర్డినేటర్ బోడేపూడి రామారావు అకాడమీ ప్రతినిధులకు ధ్రువీకరణపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో అప్‌కాస్ట్ మెంబర్ సెక్రటరీ డాక్టర్ కె. శరత్‌కుమార్, కేఎల్ వర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జేవీ షణ్ముఖ కుమార్, సెర్చ్ ఎన్‌జీవో సంస్థ అధ్యక్షుడు మన్నవ హనుమప్రసాద్, అమ్మనాన్న చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు చెన్న పోతురాజు, పాఠశాలల కరస్పాండెంట్లు పాటిబండ్ల విష్ణువర్ధన్, కట్టా శ్రీనివాసరావు పాల్గొన్నారు.
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం కోసం ప్రయోగం వాహన రివర్స్ అలారంతయారు చేసిన విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment