నాలుగు పళ్ల విభాగంలో విజేత బాపట్ల జిల్లా
రాజుపాలెం: మండలంలోని ఆకుల గణపవరంలో గల శ్రీ ప్రసన్నాంజనేయస్వామి 96వ జయంత్యుత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఎడ్ల పందేలు ఆదివారం రసవత్తరంగా జరిగాయి. నాలుగు పళ్ల విభాగంలో బాపట్ల జిల్లా పంగులూరు చిలుకూరి నాగేశ్వరరావుకు చెందిన ఎడ్ల జత 5,278 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానంలో నిలిచింది. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరికి చెందిన చీరబోయిన కోటేశ్వరరావు ఎడ్ల జత 4,250 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవ్వులూరు గ్రామానికి చెందిన బత్తుల శ్రీనివాసరావు ఎడ్ల జత 4,000 అడుగుల దూరం లాగి తృతీయ స్థానంలో నిలిచాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం భీమవరానికి చెందిన దివ్యశ్రీ ఎడ్ల జత 3,027 అడుగుల దూరం లాగి నాల్గవ స్థానం, పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం నిండుజర్లకు చెందిన ప్రసన్నాంజనేయ ఎడ్ల జత 2250 అడుగుల దూరం లాగి ఐదవ స్థానం సాధించాయి. సోమవారం వ్యవసాయ విభాగంలో పందేలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి రోజూ పందేలు చూడటానికి వచ్చే రైతులకు అన్నదానం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment