1,21,706 బస్తాల మిర్చి విక్రయం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు శుక్రవారం 1,12,589 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,21,706 బస్తాల అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,500 నుంచి రూ.13,800 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.7,200 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 51,200 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు.
జన గణనతోపాటే
కులగణన జరపాలి
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు
మంగళగిరి: జనగణనతోపాటే సమగ్ర కులగణన జరపాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని ఆత్మకూరు జాతీయ రహదారి వెంట ఉన్న సంఘ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓబీసీల ప్రధాన డిమాండ్లపై జాతీయస్థాయిలో ఈ నెల 24,25,26 తేదీలలో తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు. మహిళా రిజర్వేషన్ కోటాలో ఓబీసీ మహిళల సబ్ కోటా చేయాలని డిమాండ్ చేశారు. ఓబీసీల ప్రధాన డిమాండ్లపై 24న కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులను కలిసి విజ్ఞాపన పత్రాలు అందజేస్తామని పేర్కొన్నారు. సమగ్ర కుల గణనలో జాప్యాన్ని నిరసిస్తూ జంతర్ మంతర్ వద్ద 25న ధర్నా చేపడతామన్నారు. 26న ఓబీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జంతర్‌మంతర్ వద్ద నిరసన కార్యక్రమం చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి కుమ్మరి క్రాంతికుమార్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఉప్పాల శివలక్ష్మి, శాలివాహన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీవీఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
1,21,706 బస్తాల మిర్చి విక్రయం
Comments
Please login to add a commentAdd a comment