కూటమి నేతలకు తొత్తులుగా అధికార యంత్రాంగం
గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకిరెడ్డి నాగనారాయణమూర్తి
తాడేపల్లిరూరల్: కూటమి నేతలు చెప్పినట్టు అధికారులు పనిచేస్తున్నారని, తక్షణమే వారి తీరు మార్చుకోవాలని వైఎస్సార్‌సీపీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అంకిరెడ్డి నాగనారాయణమూర్తి హితవు పలికారు. మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతి ఫొటోలు మార్ఫింగ్ చేస్తూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యవహారంపై శుక్రవారం మరోసారి తాడేపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. అలాగే మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన కుటుంబం, మహిళా నాయకులు, కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యేలపై ఫేస్‌బుక్‌లో, ఇతర సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా మాట్లాడుతూ, ఫొటోలు మార్ఫింగ్ చేసి పోస్టులు పెడుతున్నారని, వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment