సాంకేతిక పరిజ్ఞానంతో నేత్ర సమస్యల పరిష్కారం
గుంటూరు ఎడ్యుకేషన్: నేత్ర సంబంధ సమస్యలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కరించవచ్చని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ఆదివారం భాష్యం విద్యాసంస్థల ఆధ్వర్యంలో చంద్రమౌళీనగర్‌లో నెలకొల్పిన మెడెక్స్ హాస్పిటల్స్‌లో ఆధునిక నేత్ర సంరక్షణ వైద్యసేవలను ఆయన ప్రారంభించారు. పెమ్మసాని మాట్లాడుతూ భాష్యం విద్యాసంస్థల చైర్మన్ రామకృష్ణ మెడెక్స్ హాస్పిటల్స్ ద్వారా వైద్యరంగంలో అడుగుపెట్టడం శుభపరిణామమన్నారు. ప్రముఖ గుండె మార్పిడి శస్త్ర చికిత్స నిపుణుడు డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే మెడెక్స్ హాస్పిటల్స్‌లో ఏర్పాటు చేసిన కంటి, దంత, చర్మ, సైకాలజీ వైద్య సేవల విభాగాలను సందర్శించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులో ఉన్న వైద్య సేవల గురించి సిబ్బంది ఆయనకు వివరించారు. భాష్యం చైర్మన్ రామకృష్ణ మాట్లాడుతూ అడ్వాన్స్‌డ్ ఐ కేర్ యూనిట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏప్రిల్ 23 వరకు మెడెక్స్ హాస్పిటల్స్‌లో ఉచిత కంటి వైద్య పరీక్షలు అందుబాటులో ఉంటాయని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తొలుత వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య ఆస్పత్రిని ప్రారంభోత్సవం చేశారు. కార్యక్రమంలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, భాష్యం విద్యాసంస్థల వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, మెడెక్స్ హాస్పిటల్స్ ఐ కేర్ యూనిట్ చీఫ్ ఆఫ్తమాలజిస్ట్ డాక్టర్ యర్రారపు మాధవీలత, సిబ్బంది పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
Comments
Please login to add a commentAdd a comment