
ఇంటర్ ఫలితాల్లో శ్రీమేధ ప్రభంజనం
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాల్లో శ్రీమేధ విద్యార్థులు ప్రభంజనం సృష్టించినట్లు విద్యాసంస్థల చైర్మన్ అన్నా నందకిశోర్ తెలిపారు. శనివారం కొత్తపేటలోని కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత 20 ఏళ్లుగా ఇంటర్ ఫలితాల్లో తమ కళాశాల రాష్ట్రస్థాయిలో టాప్ మార్కులతో పాటు అత్యధిక ఉత్తీర్ణతతో విజయభేరి మోగించిందని తెలిపారు. వ్యక్తిగత శ్రద్ధ, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, క్రమశిక్షణతో కూడిన ప్రణాళికాబద్ధమైన బోధనతో తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని వివరించారు. జూనియర్ ఇంటర్ ఎంఈసీ విభాగంలో 500 మార్కులకు గానూ జి. వంశీ ప్రియ 491, సీహెచ్. తన్మయి 491, ఎస్. యోషిత 490, పి. కృష్ణచైతన్య 490, వి. యుక్త యువరాణి 489, ఎంఎల్‌వీఎన్ యశస్విని 489, వై. తన్వీశ్రీ 488, ఎస్. మేఘన 488, సీఈసీ విభాగంలో కె. సర్వంత్ 458 మార్కులు సాధించారని తెలిపారు. సీనియర్ ఎంఈసీ విభాగంలో ఆర్. యెమిత మహి 979, ఎన్వీ కౌశిక్ సాయి 979, వీజే సాయి శ్రీయ 975, కె. వైసిల్య 972, సీఈసీలో పి. సందీప్ కుమార్ 952 మార్కులతో అగ్రస్థానంలో నిలిచినట్లు వివరించారు. ఈ సందర్భంగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి శ్రీమేధ చైర్మన్ అన్నా నందకిశోర్, కరస్పాండెంట్ అన్నా శ్రీలక్ష్మి అభినందనలు తెలియజేశారు.